Karan Johar: ఛీ.. కరణ్ జోహార్ ఇంత నీచమైన వ్యక్తా.. అలాంటి ఆసక్తి ఎక్కువంటూ?

Karan Johar: బాలీవుడ్ దర్శకుడుగా నిర్మాతగా కరణ్ జోహార్ ఎంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారో మనకు తెలిసిందే. ఈయన ఇండస్ట్రీలో దర్శకుడిగా మాత్రమే కాకుండా వ్యాఖ్యాతగా కూడా కాఫీ విత్ కరణ్ టాక్ షో ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇప్పటికే ఆరు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం ఏడవ సీజన్ కూడా పూర్తి అయింది.

అయితే ఈ కార్యక్రమం ద్వారా ఈయన బాలీవుడ్ సెలబ్రిటీలను ఆహ్వానించి వారి వ్యక్తిగత జీవితం గురించి పెద్ద ఎత్తున ప్రశ్నిస్తూ ఉంటారు. అయితే ఈ షోలో భాగంగా సెలబ్రిటీలను అడిగే ప్రశ్నల పట్ల దారుణమైన ట్రోలింగ్ కూడా ఎదుర్కొంటున్నారు.తాజాగా ఈ కార్యక్రమం పూర్తి కావడంతో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన పలు ఆసక్తికరమైన విషయాలను చెబుతూ ట్రోలర్స్ కు సమాధానం ఇచ్చారు.

ముఖ్యంగా కరణ్ ఈ షోలో సెలబ్రిటీల శృంగార జీవితం గురించి ప్రశ్నలు అడగడంతో తీవ్రస్థాయిలో ట్రోలింగ్ ఎదుర్కొన్నారు. అయితే ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఇదే ప్రశ్న ఎదురవడంతో ఈయన నాకు ఇతరుల సెక్స్ లైఫ్ గురించి తెలుసుకోవడం ఆసక్తిగా ఉందేమో అందుకే అలాంటి ప్రశ్నలు అడిగాను అంటూ షాకింగ్ సమాధానం చెప్పారు. ఇక పలుమార్లు ఈ కార్యక్రమంలో ఆలియా పేరు ప్రస్తావించానని కూడా ట్రోలింగ్స్ ఎదురయ్యాయి.

ఈ విషయంపై కరణ్ స్పందిస్తూ నాకు అలియాని చూస్తే గర్వంగా ఉందనిపించింది అందుకే తన పేరును పదేపదే ప్రస్తావించానని ఈ సందర్భంగా ఈయన చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ కార్యక్రమం చివర్లో ఫైనల్ గా అందరికీ ఒకే విషయం చెబుతున్నా ఇది కేవలం టాక్ షో ఇందులో అన్ని రకాల ప్రశ్నలను అడుగుతాను ప్రత్యేకించి ఇలాంటి ప్రశ్నల గురించి ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన పనిలేదని కరణ్ వెల్లడించారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -