Kavitha: నెల్లూరు కవితకు పెళ్లి కుదిరిందట.. భర్త ఎవరంటే?

Kavitha: వివిధ షో ల పుణ్యమా అని చాలా మంది మరుగున పడిన మంచి కళాకారులకు తగిన గుర్తింపు లభిస్తుంది. అలా ఈ మధ్య చాలా మంది తెలుగు అమ్మాయిలు మంచి పాపులారిటీ సంపాదించారు. అలా ఈ మధ్య కాలంలో ఫేమస్ అయిన చాల మందిలో కండక్టర్ ఝాన్సీ, నెల్లూరు కవిత లాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇక నెల్లూరు కవిత ఎంత ఫేమస్ అయిందో చెప్పనవసరం లేదు.

ఆ షో తో చాలా ఫేమస్..
కవిత డాన్స్ చాలా బాగా చేస్తుంది. నెల్లూరు కవిత డ్యాన్స్ కు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అయితే ఆ టాలెంట్ ఇన్ని రోజులు బాహ్య ప్రపంచానికి తెలియదు. శ్రీదేవి డ్రామా కంపెనీలో పాల్గొని తాను ఇచ్చిన పర్ఫామెన్స్ కు భారీ స్పందన వచ్చింది. దాంతో ఆమె ఎవ్వరు ఊహించనంత పాపులర్ అయ్యింది. ఇక అప్పటి నుండి ఎన్నో అవకాశాలు వచ్చి తన తలుపు తడుతున్నాయి.

తన వ్యక్తిగత జీవితం గురించి పంచుకున్న కవిత.. తాను నార్మల్ గా కామ్ గా ఉంటానని, అయితే స్టేజ్ ఎక్కితే మాత్రం ఒకరకంగా పూనకం వస్తుందని ఆమె పేర్కొన్నారు. శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా ఫేమస్ అవుతానని ముందే అనుకున్నానని, కానీ ఈ స్థాయిలో ఊహించనంత రీచ్ వస్తుందని తాను భావించలేదని చెప్పుకొచ్చింది. కాగా ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా ప్రస్తుతం జబర్దస్త్ లో చేస్తున్నానని ప్రకటించింది.

తనతో పెళ్లి..
తనకు పెళ్లి ప్లాన్ ఉందని ప్లాన్ బయటపెట్టేసింది నెల్లూరు కవిత. పెళ్లి గురించి ఆలోచనలు ఉన్నాయని నెల్లూరు కవిత తెలిపారు. ఒక ఈవెంట్ ఆర్గనైజర్ ను పెళ్లి చేసుకోబోతున్నానని ఈ సందర్బంగా ఆమె పేర్కొన్నారు. తాను విమర్శలను పెద్దగా పట్టించుకోనని, పట్టించుకున్న వాటిని పాజిటివ్ గా తీసుకుంటానని తెలిపింది. ఇక తాను పొందిన పాపులారిటీతో ప్రస్తుతం నెల్లూరు కవితకు భారీగా రెమ్యునరేషన్ దక్కుతోందని వార్తలు వినిపిస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -