Keerthi Suresh: కీర్తి సురేష్ షాకింగ్ కామెంట్స్.. ఆ పని చేయనంటూ?

Keerthi Suresh: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నటి కీర్తి సురేష్ స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. ఇండస్ట్రీలో అడుగు పెట్టిన మొదట్లో కొంచెం పద్ధతిగా కనిపించిన ఈ భామ.. ఆ తర్వాత హీరోయిన్ల మధ్య పోటీ వల్ల గ్లామరస్ పాత్రల్లో కనిపించడానికి కూడా సిద్ధమైంది. 2000లో బాలనటిగా తెరంగేట్రం చేసిన ఈ భామ.. 2013లో విడుదలైన మలయాళం సినిమా గీతాంజలితో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటివరకు తెలుగు, తమిళం, మలయాళం సినిమాల్లో నటిస్తూ.. స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. ‘నేను శైలజ’ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మంచి హిట్ అందుకుంది. దాంతో తెలుగులో కీర్తి సురేష్‌కు ఆఫర్లు పెరిగాయి. ‘నేను లోకల్, అజ్ఞాతవాసి, మహానాటి, మిస్ ఇండియా, రంగ్ దే, పెద్దన్న, సర్కారు వారి పాట’ వంటి సినిమాల్లో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. ఆమె నటించిన చాలా వరకు సినిమాలు హిట్టయ్యాయి.

 

అయితే మొదట్లో పద్ధతిగా కనిపించిన కీర్తి సురేష్.. ఇప్పుడు కమర్షియల్‌గా ఆలోచిస్తోంది. తోటి హీరోయిన్లతో పోటీపడుతూ.. ఎక్స్ పోజింగ్ చేస్తోంది. ‘సర్కారు వారి పాట’ సినిమాలో ఆమె యాక్టింగ్‌కు అందరూ ఆశ్చర్యపోయారు. హద్దులు చెరిపేసి నటించందని ప్రేక్షకులు కామెంట్ చేశారు. మాస్ టచ్‌తోపాటు రొమాంటిక్ యాంగిల్‌లో కీర్తి యాక్టింగ్ ఇరగదీసింది. అయితే కీర్తి సురేష్ అలా నటించడం కొంత మందికి నచ్చకపోయినా.. మరికొందరు షాక్ అవుతున్నారు. తాజాగా కీర్తి సురేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. కోలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నలకు సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘మీకు క్యాస్టింగ్ కౌచ్ ఎదురైందా? ఒక వేళ ఎవరైనా మిమ్మల్నీ కమిట్‌మెంట్ ఇస్తేనే మీరు హీరోయిన్ అవుతారంటే మీ సమాధానమేంటీ? అని ప్రశ్నించారు. దానికి కీర్తి సురేష్ సమాధానం చెబుతూ..‘నాకు క్యాస్టింగ్ కౌచ్ ఎదురైతే అసలు సినిమాలు చేయను. సినిమాలు మానేసి జాబ్ చేసుకుంటాను. కానీ ఆ పని మాత్రం చేయను. సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని నాకు తెలుసు. నాతోపాటు నటిస్తున్న చాలా మంది హీరోయిన్లు నాతో ఆ విషయం చెప్పారు. కానీ అది నా వరకు ఎదురు కాలేదు.’ అని ముఖం మీదే చెప్పేసింది. దీంతో ప్రస్తుతం కీర్తి సురేష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -