AP Pensions: ఏపీ ప్రజలకు మూడు నెలలు పెన్షన్లు రావట.. ఈ ఫ్రస్టేషన్ వెనుక అసలు లెక్క ఇదేనా?

AP Pensions: వైసీపీలో నానిల లిస్ట్ చాలా ఎక్కువగా ఉంది. విచిత్రం ఏంటంటే ఆ పార్టీలో నానిలందరికీ నోటీ దురుసు ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్య వైసీపీలోకి మరో నాని చేరారు. ఆయనే కేశినేని నాని. 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ తరుఫున ఎంపీగా గెలిచిన ఆయన ఈ ఎన్నికల్లో వైసీపీలో చేరి ఆ పార్టీ తరుఫున పోటీ చేస్తున్నారు. ఆయనపై కొంత సానుకూలత ఉన్నప్పటికీ టీడీపీని వీడటంతో ఆయనకు ఉన్న క్రెడిబిలిటీ పోయింది. అమరావతి సెంటిమెంట్ కృష్ణ, గుంటూరు జిల్లాలో ఉంది. కాబట్టి అక్కడ వైసీపీపై తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తుంది. అలాంటి పార్టీలో కేశినేని నాని చేరడంతో ఆయనపై స్థానిక ప్రజలు గుర్రుగా ఉన్నారు. పైగా విజయవాడలో టీడీపీకి బలం ఎక్కువ. ఈ సమీకరణాలు అన్ని కేశినేని నానికి ఇబ్బందుల తెచ్చిపెట్టక తప్పదు. ఆయన హ్యాట్రిక్ కొట్టాలని ఆశపడుతున్నా.. ఓటమి తప్పదని అంటున్నారు. ఆయనకు కూడా తన ఓటమిపై క్లారిటీ వచ్చిందేమో తెలియదు కానీ.. ఏం మాట్లాడుతున్నారో ఆయనకు కూడా అర్థం కావడం లేదు.

3 నెలల పాటు వృద్దులకు పెన్షన్లు ఉండవని ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అసలు పెన్షన్లు ఉండవని ఆయనకు ఎవరు చెప్పారు? టీడీపీపై నిందలు వేసే ప్రయత్నంలో భాగంగా ఆయన ఈ కామెంట్స్ చేశారు. టీడీపీ వృద్ధులకు ఫించన్ల పంపిణీని అడ్డుకుంటుంది. ఈసీకి లేఖరాసింది. అందుకే ఈసీ వాలంటీర్లను విధులకు దూరంగా ఉంచిందని అన్నారు. ఈసీ వాలంటీర్లను విధులకు దూరంగా ఉంచిన మాట వాస్తవమే. కానీ, ఫించన్ల పంపిణీని నిలిపివేయాలని ఎక్కడా చెప్పలేదు. అంతేకాదు.. ఫించన్లు పంపిణీకి గైడ్ లైన్స్ కూడా జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు ఫించన్లు పంపిణీ చేయాలని చెప్పింది. వాలంటీర్లు ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉండటంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, కేశినేని నాని చేసిన కామెంట్స్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకరంగా మారాయి. చంద్రబాబు నాయుడు ప్రజలకు ఫించన్లు అందకుండా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. వృద్ధులకు మూడు నెలల పాటు పెన్షన్ల పంపిణీ నిలిచిపోతుందని అన్నారు. దీంతో.. రాష్ట్రవ్యాప్తంగా వృద్ధులు ఆందోళన చెందుతున్నారు. వృద్దులు మాత్రమే కాదు. అన్ని వర్గాల్లో ఓ రకమైన అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

కేశినేని నాని చెప్పినట్టు నిజంగానే పెన్షన్ల పంపిణీ నిలిచిపోతుందేమో అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వం ఇలాంటి కుట్రలకు తెరలేపుతుందా? అని అన్ని వర్గాలు చర్చించుకుంటున్నాయి. పెన్షన్లు నిలిపివేసి ఆ అపవాదు చంద్రబాబుపై నెట్టివేసే కుట్ర ఏమైనా జరుగుతుందా? అని అనుమానిస్తున్నారు. నిజానికి జగన్ కు అలాంటి అధికారాలు లేవు. పాలన మొత్తం ఇప్పుడు ఈసీ డైరెక్షన్ లోనే జరుగుతుంది. కానీ.. వైసీపీ నేతల అడుగులకు మడుగుల ఒత్తే అధికారులు చాలా మంది ఉన్నారు. వారి సాయంతో ప్రభ్వుత్వం ఫించన్ల పంపిణీ నిలిపివేసే కుట్ర చేస్తుందా? అని చర్చించుకుంటున్నారు. అయితే, అలాంటి పరిస్థితి ఉండకపోవచ్చని కూడా కొంతమంది అంటున్నారు. టీడీపీపై అలాంటి అపవాదు నెట్టివేసే ప్రయత్నం చేస్తే అది అధికార పార్టీకే మోసం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే.. ఈసీ చాలా క్లియర్ గా ఫించన్ల పంపిణీకి వాలంటీర్లు దూరంగా ఉండాలని మాత్రమే ఆదేశించింది. అంతేకానీ.. పెన్షన్లు నిలిపివేయాలని చెప్పలేదు. ఇప్పుడు ఒకవేళ అలాంటి దురుద్దేశంతో ఆపివేస్తే అధికార పార్టీకి తీవ్రమైన ఇబ్బందులు తప్పవు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -