Music Director Ravi Basrur: రోజు కూలి నుంచి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగిన కేజిఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూల్!

Music Director Ravi Basrur: ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరికెక్కిన కేజీఎఫ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసిందే. ఈ సినిమాతో ఒక్కసారిగా దేశం మొత్తం కన్నడ చిత్ర పరిశ్రమ వైపు తొంగి చూసింది.ఇలా కేజీఎఫ్ సినిమాతో 2018 సంవత్సరంలో ప్రభంజనం సృష్టించిన ఈ సినిమా బిజిఎం అదిరిపోయాయని చెప్పాలి. ఈ సినిమా చూసిన అనంతరం మ్యూజిక్ లవర్స్ సైతం ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటూ వెతకడం మొదలుపెట్టారు.

ఈ సినిమాకి ముందు వరకు కేవలం కన్నడ చిత్రపరిశ్రమలో ఒక సాధారణ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న బస్రూల్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఈ విధంగా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో పేద ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన ఇండస్ట్రీకి రాకముందు ఏం చేసేవారు అనే విషయానికి వస్తే…

రవి ఇండస్ట్రీ లోకి రాకముందు కార్పెంటర్, పెయింటింగ్ లాంటి చిన్న చిన్న పనులు చేసేవారట. అయితే ఇతనిలో ఉన్న టాలెంట్ గుర్తించిన ప్రశాంత్ నీల్ ఈయనకు మొదటిసారి ఉగ్రం సినిమాకి అవకాశం కల్పించారట ఈ సినిమా అనంతరం ఈయన కే జి ఎఫ్ సినిమాకు సంగీతం అందించారు. ఇక కేజిఎఫ్ సినిమాతో ఒక్కసారిగా ఈయన పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

ఇక కేజిఎఫ్ సినిమా మొదటి భాగం విడుదలైన అనంతరం లాక్ డౌన్ సమయంలో ఈయన తన సొంత గ్రామానికి వెళ్లి తన తండ్రితో పాటు రోజు కూలి పనులలో భాగంగా దేవుళ్ళ బొమ్మలను తయారు చేస్తూ 35 రూపాయల కూలీ తీసుకునే వారట. ఈ విధంగా కోట్లు సంపాదించిన ఈయన తన తండ్రికి చేదోడువాదోడుగా ఉండి సంపాదించిన 35 రూపాయలలో ఎంతో సంతోషం ఉందని తెలిపారు. మరోసారి రికార్డులు బద్దలు కొట్టారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -