K.G.F vs Kancharapalem:కేజీఎఫ్ వర్సెస్ కంచరపాలెంలలో గొప్ప మూవీ ఏదంటే?

K.G.F vs Kancharapalem: సినిమా అంటే కేవలం కథనే కాకుండా అందులో ఆకర్షించే సన్నివేశాలు, నటీనటుల నటన, ఇతర యాక్షన్స్ సన్నివేశాలు ఇలా చాలా ఉంటాయి. అయితే ఒక కాన్సెప్ట్ తో వచ్చే సినిమా అనేది అందరికీ నచ్చాలని లేదు. కొందరికి మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు నచ్చితే.. మరి కొంతమందికి యాక్షన్ నేపథ్యంలో వచ్చే సినిమాలు ఇష్టపడుతుంటారు.

 

నిజానికి ప్రేక్షకుల అభిరుచుల బట్టి సినిమాలు హిట్ అవుతూ ఉంటాయి. అది పెద్ద స్టార్ హీరో సినిమా అయినా లేదా చిన్న హీరో సినిమా అయినా అసలు ముక్కు ముఖం తెలియని హీరో సినిమా వచ్చినా కూడా.. అందరూ హీరోలను కాకుండా.. సినిమాలో ఉండే కంటెంట్ ని చూసి, యాక్షన్ ను చూసి ఇష్టపడుతూ ఉంటారు. ఒక పెద్ద సినిమా విడుదలైనప్పుడు అదే సమయంలో మంచి కంటెంట్ తో వచ్చిన ఒక చిన్న సినిమా కూడా విడుదల అయితే.. ఆ సినిమా పెద్ద సినిమాకు పోటీగా బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.

అలా సినిమాల విషయంలో ఒక్కొక్క ప్రేక్షకుడికి ఒక్కో బినాభిప్రాయం ఉంటుంది. అయితే ఇదంతా ఇప్పుడు చర్చ ఎందుకు నడుస్తుంది అంటే.. రీసెంట్ గా కేరాఫ్ కంచరపాలెం సినిమా దర్శకుడు వెంకటేష్ మహా కే జి ఎఫ్ సినిమా విషయంలో చేసిన కామెంట్లు బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీంతో చాలామంది ఆ దర్శకుడిపై ఫైర్ అయ్యారు.

 

కే జి ఎఫ్ సినిమాపై ఆయన అలా కామెంట్లు చేయడం సరికాదు అంటూ హ్యాష్ ట్యాగ్ లతో బాగా రచ్చ చేశారు. అయితే కేజిఎఫ్ గొప్పదా.. కేరాఫ్ కంచరపాలెం గొప్పదా అంటూ బాగా చర్చ కూడా జరిగింది. నిజానికి కథ పరంగా రెండు సినిమాలు మంచి సినిమాలే. కానీ కమర్షియల్ గా కేజిఎఫ్ గొప్ప సినిమా అని చెప్పవచ్చు. ఇక డైరెక్టర్ వెంకటేష్ మహా చెప్పిన లాజిక్ అనేది కేజీఎఫ్ సినిమాకు అస్సలు లింకు లేకపోయింది. అప్పుడప్పుడు దర్శక నిర్మాతలు నోరు జారడం వల్ల ఇటువంటివి ఎదురవుతూ ఉంటాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -