Kodali Nani: గుడివాడలో కొడాలి నాని ఆశలు గల్లంతు.. ఆ బూతులే పార్టీని ముంచేశాయా?

Kodali Nani: కొడాలి నాని గురించి ఏపీలో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రాజకీయాలపై కాస్త అవగాహన ఉన్నవారికి ఏపీలో బూతుల మంత్రి ఎవరు అంటే కొడాలి నానిని చూపిస్తారు. చంద్రబాబు, నారాలోకేష్ పై అసభ్యపదజాలంతో దూషించాలంటే నాని ముందు వరుసలో ఉంటారు. రెండు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న కొడాలి నాని ఓటమి ఎరుగని నేతగా ఉన్నారు. 2004, 09లో టీడీపీ తరుఫున పోటీ చేసి గెలిచారు. 2014, 19లో వైసీపీ తరుఫున పోటీ చేసి గెలిచారు. పార్టీ ఏదైనా గుడివాడలో గెలుపు నానిదే అన్నట్టుగా వ్యవహారం మారింది. అయితే, ఈ సారి నాని గెలుపు అంత ఈజీగా లేదు. వైసీపీలో చేరిన తర్వాత చంద్రబాబు, లోకేష్ పై పరుష పదజాలంతో నాని విరుచుకుపడేవారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొడాలి నానిని జగన్ తన కేబినెట్ లోకి తీసుకున్నారు. మంత్రి అయిన తరువాత తన విమర్శల డోస్‌ను బాగా పెంచారు. ఈ బూతు విమర్శలే నానికి ఓడిస్తాయని లోకల్ గా చర్చ జరుగుతుంది.

కొన్ని రోజుల నుంచి గుడివాడలో నాని ప్రచారం జోరు పెంచారు. అయితే, ఎన్నికల ప్రచారంలో ఆయనకు అడుగడుగునా అడ్డండకులు ఎదురవుతున్నాయి. గుడ్‌మాన్‌ పేట మ‌హిళ‌లు కొడాలి నానిని స‌మ‌స్యల‌పై నిల‌దీశారు. తాగునీటి సమస్య, ఇండ్ల పట్టాలపై మహిళలు నిలదీశారు. ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా తమను ఇబ్బంది పెడుతున్నారని, ఎందుకు అలా చేస్తున్నారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వెంటనే కొడాలి నాని ఆర్డీవోకు ఫోన్ చేసి మహిళలకు ఇళ్లపట్టాలు ఇవ్వాలని సూచించాడు. అయితే ఎన్నికల కోడ్ ఉంది కనుక ఇళ్లపట్టాల పంపిణీ సాధ్యం కాదు. ఆ విషయం కొడాలి నానికి కూడా తెలుసు కానీ.. బిల్డప్ కోసం ఫోన్ చేశాడు. మహిళలు ఆ విషయం గ్రహించి.. ఇన్నాళ్లు పట్టాలు ఇవ్వకుండా కోడ్ వచ్చిన తర్వాత ఆర్డీవోకు కాల్ చేస్తావా? అని నిలదీశారు. ఇలాంటి ఘటనలు నియోజవర్గంలో కోకొల్లలుగా ఉన్నాయి. టీడీపీ శ్రేణులు అక్కడ కొడాలి నానిని ఓడించాలే కసి మీద ఉన్నారు. టీడీపీ అభ్యర్థిగా వెనిగండ్ల రాము ఉన్నారు. ఆయన టీడీపీ శ్రేణులు స్థానికుల్లో కోటి ఆశ‌లు నింపుతున్నా రు. గుడివాడలో వెనిగండ్ల రాము ప్రతీ రోజూ 15 గంటలు ప్రజలతో మమేకం అవుతూ తిరుగుతున్నారు. ప్రజలు తమ వద్దకు వస్తే.. కలవడం కాదు.. ఆయన ప్రజలు దగ్గరకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. దీంతో.. ప్రజల్లో ఓ ఉత్సాహం వచ్చింది.

దీనికి తోడు గతంలో మెగాస్టార్ చిరంజీవిపై నాని చేసిన వ్యాఖ్యలు కూడా నియోజర్గంలో ఆయనపై వ్యతిరేకతను పెంచారు. ప్రతీ పకోడీగాళ్లు ప్రభుత్వానికి సలహా ఇవ్వడమే అని ఆయన చేసిన కామెంట్స్ అప్పట్లో సంచలనంగా మారాయి. అప్పుడు నాని ఆ మాటలను సరిదిద్దుకొనే ప్రయత్నం చేసినా.. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నాని కూడా ఈ ఎన్నికల్లో ఓడిపోతానని అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. అందుకే.. ఆ మధ్య ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవే తనకు చివరి ఎన్నికలు అని అన్నారు. ఇప్పుడు తన వయసు 53 ఏళ్లని.. మరోసారి గెలిస్తే 58 ఏళ్ల వరకూ పదవిలో ఉంటానని చెప్పారు. ఆ తర్వాత ఇంకా రాజకీయం చేయలేమని తేల్చేశారు. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని.. వారికి రాజకీయాలపై ఆసక్తిలేదని చెప్పారు. ఆసక్తి ఉంటే తన తమ్ముడు కొడుకు రాజకీయాలు చేస్తాడని అన్నారు. ఓటమి భయంతోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని పలువురు సెటైర్లు వేశారు.

ఇటీవలే నాని ఎన్నికల ప్రచారం జోరు పెంచారు. కానీ, అడుగడుగునా నిరసలను వ్యక్తం అవుతున్నాయి. ఆ నిరసలను బయటకు కనిపించకూడదని కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఇటీవల ఆయన వాలంటీర్లతో కాళ్లు కడిగించుకున్నారు. అది పెద్ద ఎత్తున విమర్శలకు దారి తీసింది. పాలతో కాలు కడిగించుకోవడం ఏంటో అర్థం కావడం లేదని పలువరు సెటైర్లు వేస్తున్నారు. ఓ మహిళ మొహానికి ముగుసు వేసుకొని మరీ కొడాలి నాని కాలు కడిగారు. ప్రతీరోజూ నాని వెనక వంద మంది ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రతీ పది ఇళ్లకు హారతి ఇవ్వడానికి రెడీగా ఉంటారు. అడుగడుగునా పూల దండలు వేసే వాళ్లు రెడీగా ఉంటారు. ఇలా పక్కా ప్లాన్ చేయించుకున్నారు. సరే ఇంత హడావుడి చేస్తున్నారు కదా? నియోజవర్గానికి ఏమైనా చేశారా అంటే అదీలేదు. ఇరవై ఏళ్లుగా గుడివాడకు ఎమ్మెల్యేగా ఉన్నారు. రెండున్నరేళ్లు మంత్రిగా ఉన్నారు. బూతులు తిట్టడం తప్పా ఏమీ లేదు. ఓ ప్రజా ప్రతినిధి ఎలా ఉండకూడదో ఓ ఉదాహరణగా కొడాలి నానిని చూపించవచ్చు. నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యం.

Related Articles

ట్రేండింగ్

YSRCP Manifesto: జగన్ మేనిఫెస్టోపై జనాభిప్రాయం ఇదే.. బాబోయ్ జగన్ అంటున్న ఏపీ ప్రజలు!

YSRCP Manifesto: శనివారం రోజు మన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ మేనిఫెస్టోని విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే టీడీపీ ప్రకటించిన సూపర్ సిక్స్ ముందు వైసీపీ మేనిఫెస్టో...
- Advertisement -
- Advertisement -