Kodali Nani: కొడాలి కాళ్లకు పాలాభిషేకం.. నాని బిల్డప్‌ చూసి పట్టణవాసులు ఆశ్చర్యపోయారుగా!

Kodali Nani: ఎన్నికలు వచ్చాయంటే చాలు. చాలా విచిత్రాలు చూస్తాం. నిత్యం ప్రజల మనుషుల్లా నాయకులు బిల్డప్ ఇస్తూ ఉంటారు. చికెన్ షాపులో చికెన్ కొడుతూ ఓ నేత ఫోటోలకు ఫోజులు ఇస్తాడు. బార్బర్ షాపులో కటింగ్ చూస్తున్నట్టు ఫోటోలు దిగుతారు. ముసలి వాళ్లకు సాయం చేస్తూ మరి కొందరు బిల్డప్ ఇస్తారు. టిఫిన్ షాపులో ఓ ఇడ్లీనో, దోసెనో వేస్తూ ఫోటోలు దిగుతారు. ఇది సహజం. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇలాంటివి చూస్తూ ఉంటాం. చూసి అలవాటు పడిపోయాం. కానీ.. గుడివాడ వైసీపీ అభ్యర్థి గుడివాడ నాని రూటే సెపరేట్ కదా? ప్రెస్ మీట్లలో, పబ్లిక్ మీటింగుల్లో ఇలా ఎక్కడ నచ్చితే అక్కడ నోటి కొచ్చిన బూతులు మాట్లాడుతారు. ఎవరు ఏమైనా అనుకుంటారా అనే ఇంకితం కూడా ఉండదు. బొచ్చు, బొంగు అంటూ విపక్ష నేతలపై విరుచుకుపడతారు. బయట పబ్లిక్ మీటింగ్స్ లోనే అనుకుంటే.. అసెంబ్లీలో కూడా అదే తీరు. అసెంబ్లీలో కూడా బూతుల సంస్కృతిని తీసుకొచ్చిన ఘనత కొడాలి నానికే దక్కుతుంది. అలాంటి కొడాలి నాని కొత్త రకమైన ప్రచారానికి తెరలేపారు.

ప్రచారంలో ఎవరైనా ప్రజలకు అందుబాటులో ఉంటా.. వీలైంత సాయం చేస్తానని చెప్పడానికి ఆ క్షణం వారు చేస్తున్న పనుల్లో కాస్త సాయం చేస్తూ ఫోటోలు దిగుతారు. కానీ.. నాని బిల్డప్ మరో రేంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంది. ఏకంగా ఆయనే ప్రజలతో పాలాభిషేకం చేయించుకుంటున్నారు. అది కూడా కాలు కడిగించుకుంటున్నారు. ఇదేం విచిత్రమో ఏంటో అర్థం కావడం లేదు. మామూలుగా ఎవరో కాలు కడిగితే అభిమానంతో కడిగారు అనుకోవచ్చు. కానీ.. పాలతో కాలు కడిగించుకోవడం ఏంటో అర్థం కావడం లేదు. ఓ మహిళ మొహానికి ముగుసు వేసుకొని మరీ కొడాలి నాని కాలు కడిగారు. ఆయన ప్రచార పిచ్చి చూసి సొంతపార్టీ నేతలే విస్తుపోతున్నారు. ఎన్నికల ప్రచారంలో నాయకుడు వెనక వంద మంది ఉన్నారంటే వారిని కిరాయికి తెచ్చుకున్నదే అని అందరికీ తెలుసు. ఇలాంటి వాటికే ఎక్కువ ఖర్చు అవుతుంది. ఎవరు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా.. ఇది నిజం.

ఓ నాయకుడికి జేజేలు పలికినా.. మరో నాయుకుడికి బై బై చెప్పినా.. దాని వెనుక డబ్బు పని చేస్తుందనే అర్థం. ఇక్కడ ఎవరూ అభిమానంతోనో లేదంటే.. నాయకుడిపై నమ్మకంతోనో చేసే వాళ్లు చాలా తక్కువ. కానీ.. ఏకంగా పాలతో కాలు కడుగుతున్నారంటే వాళ్లు పెయిడ్ ఆర్టిస్టులు కాకుండా ఉంటారా? డబ్బు ఇచ్చి మరీ ఇంత భజన చేయించుకోవడం అవసరమా? అంతేకాదు.. ప్రతీరోజూ నాని వెనక వంద మంది ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రతీ పది ఇళ్లకు హారతి ఇవ్వడానికి రెడీగా ఉంటారు. అడుగడుగునా పూల దండలు వేసే వాళ్లు రెడీగా ఉంటారు. ఇలా పక్కా ప్లాన్ చేయించుకున్నారు. సరే ఇంత హడావుడి చేస్తున్నారు కదా? నియోజవర్గానికి ఏమైనా చేశారా అంటే అదీలేదు. ఇరవై ఏళ్లుగా గుడివాడకు ఎమ్మెల్యేగా ఉన్నారు. రెండున్నరేళ్లు మంత్రిగా ఉన్నారు. బూతులు తిట్టడం తప్పా ఏమీ లేదు. ఓ ప్రజా ప్రతినిధి ఎలా ఉండకూడదో ఓ ఉదాహరణగా కొడాలి నానిని చూపించవచ్చు. నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యం. అది కూడా ఎవరో చెప్పింది కాదు. ఇటీవల ఆయనే చెప్పారు. మరోసారి ప్రజలు అవకాశం ఇస్తే.. నియోజవర్గాన్ని అభివృద్ధి చేస్తానని. ఆ తర్వాత రాజకీయాల నుంచి విరమించుకుంటానని అన్నారు. అంటే అభివృద్ధి చేయలేదని ఆయనే ఒప్పుకున్నారు. అలా అని ప్రజలు నానికి ఒకసారో, రెండు సార్లో అవకాశం ఇవ్వలేదు. ఇరవై ఏళ్లుగా ఆయన్నే ఎన్నుకుంటున్నారు. ఈ ఇరవై ఏళ్లుగా చేయని అభివృద్ధి ఈ ఒక్క సారి చేసేస్తారా?

గత కొన్ని రోజులుగా ప్రచారం చేస్తున్నారు. ఆయన ప్రచారనికి ఎలాంటి కవరేజ్ దొరకడం లేదు. అందుకే ఏం చేయాలో తెలియక.. మహిళలతో కాళ్లు కడిగించుకుంటున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. మహిళను కించపరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -