Kodali Nani: గుడివాడకు కొడాలి నాని గుడ్ బై.. వచ్చే ఎన్నికల్లో అక్కడ నుంచి ఎంపీగా పోటీ?

Kodali Nani:గత ఎన్నికల్లో జగన్ వేవ్ లో వైసీపీ విజయదుధుంబి మోగించింది. 151 సీట్లు సాధించి రికార్డు విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. జగన్ క్రేజ్, అప్పట్లో టీడీపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, ఒక్క ఛాన్స్ ఇవ్వడంటూ జగన్ చెప్పిన మాటలను ఓటర్ల నమ్మడం వల్ల వైసీపీ భారీ సీట్లు సాధించుకోగలిగింది. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. టీడీపీ, జనసేన మరింత బలం పుంజుకున్నాయి. సంక్షేమ పథకాలు అమలు చేయడం తప్ప అభివృద్ధి జాడ కనిపించడం లేదు. దీంతో ప్రజల్లో వైసీసీ సర్కార్ పై వ్యతిరేకత పెరుగుతోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తు్న్నారు. ఇటీవల వెలువడుతున్న పలు సర్వేల్లో కూడా ఇదే తేలుతుందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

కానీ వచ్చే ఎన్నికల్లో మరోసారి అధికార పీఠాన్ని దక్కించుకునే దిశగా జగన్ ఇప్పటినుంచే పావులు కదుపుతున్నారు. 175కి 175 సీట్లే లక్ష్యంగా రంగంలోకి దిగారు. పీకే సర్వేల ద్వారా ఓటర్ల మూడ్ ను తెలుసుకుని దానికి తగ్గట్లు వ్యూహలు అమలు చేస్తున్నారు. పార్టీ బలహీనంగా ఉన్న స్థానాలను గుర్తించి వచ్చే ఎన్నికల్లో అక్కడ పాగా వేసేందుకు కసరత్తు చేస్తున్నారు. బలహీనంగా ఉన్న చోట పార్టీని బలపర్చుకునే ప్రయత్నాల్లో మునిగిపోయారు. అందులో భాగంగానే టీడీపీ కంచుకోటలపై జగన్ గురి పెట్టారు. టీడీపీ గెలిచే స్థానాలపై దృష్టి కేంద్రీకరించి అక్కడ పార్టీని బలోపేతం చేస్తున్నారు. కుప్పం, మంగళగిరిపై జగన్ ఫోకస్ పెట్టం వెనక అసలు కారణం అదేనని తెలుస్తోంది.

టీడీపీ కంచుకోలుగా ఉన్న నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో గెలిచి ట్రెండ్ మార్చాలని వైసీపీ భావిస్తోంది. టీడీపీ ఎక్కడ అయితే గెలుస్తూ వస్తుందే అక్కడే దెబ్బతీయాలని చూస్తోంది. టీడీపీ కంచుకోటలను బద్దలు కొట్టి వైసీపీ జెండా ఎగురవేయాలని చూస్తోంది. దానికి అనుగుణంగా జగన్ కార్యాచరణ రూపొందిస్తున్నారు. టీడీపీ కంచుకోటలే టార్గెట్ గా కొత్త స్కెచ్ లు వేస్తున్నారు. ఆ నియోజకవర్గాల్లో టీడీపీని ఓడించే బలమైన అభ్యర్థులను ఎవరనే దానిపై ఆరా తీస్తు్న్నారు. ఇప్పటికే కుప్పంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా భరత్ ను తీసుకురాగా.. మంగళగిరిలో మాజీ టీడీపీ సీనియర్ నేత గంజి చిరంజీవిని తీసుకొచ్చారు.

ఇప్పుడు టీడీపీ కంచుకోట అయిన విజయవాడ లోక్ సభ నియోజకవర్గంపై జగన్ కన్నేశారు. 2014,2019లో వరుసుగా రెండుసార్లు విజయవాడ ఎంపీ సీటును టీడీపీ దక్కించుకుంది. రెండుసార్లు ఎంపీ కేశినేని నాని గెలుపొందారు. విజయవాడ లోక్ సభ పరిధిలోని మొత్తం 7 అసెంబ్లీలో సీట్లలో 6 సీట్లను వైసీపీ గెలుచుకుంది. కానీ ఎంపీ విషయానికొచ్చే సరికి ఓడిపోవడం గమనార్హం. అంటే ఓటర్లు అసెంబ్లీ విషయానికొచ్చేసరికి వైసీపీకి, ఎంపీకి వచ్చి టీడీపీకి ఓటేసినట్లు అర్ధమవుతుంది. అలా కాకుండా ఒక ఒటరు రెండు ఓట్లు వైసీపీకే వేశారా జగన్ ప్లాన్ వేస్తున్నారు. క్రాస్ ఓటింగ్ జరిగకుడా రెండు ఓట్లు వైసీపీ వైపు పడేలా ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ క్రమంలో విజయవాడ ఎంపీ స్థానానికి బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలనే యోచనలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ తరపున ఆర్ధికంగా బలంగా ఉన్న ప్రముఖ పారిశ్రామిక వేత్త ప్రసాద్ వి పొట్లూరిని వైసీపీ బరిలోకి దింపింది. కానీ ఆయన 8,726 ఓట్ల తేడాతో కేశినేని నానిపై ఓడిపోయారు. విజయవాడ పరిధిలో కమ్మ సామాజికవర్గ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. టీడీపీ ఎప్పటినుంచో అక్కడ బాగా బలంగా ఉంది. అలాంటి చోట టీడీపీని ఓడించడం అంటే కత్తి మీద సాము అనే చెప్పవచ్చు. కానీ ఎలాగైనా అక్కడ గెలవాలనే ఉద్దేశంతో బలమైన అభ్యర్ధిని బరిలోకి దింపాలని జగన్ యోచిస్తున్నారు.

ఈ క్రమంలో కొడాలి నాని పేరు తెరపైకి వచ్చింది. కృష్ణా జిల్లాలో కొడాలి నానికి మంచి పేరుంది. కమ్మ సామాజికవర్గంలో ఆయనకు బలం ఉంది. పార్టీలకు అతీతంగా కమ్మ సామాజికవర్గం కొడాలి నానిని అభిమానిస్తుంది. దీంతో విజయవాడ ఎంపీ సీటుకు కొడాలి నాని కరెక్ట్ క్యాండిడేట్ అని జగన్ భావిస్తున్నారట. కొడాలి నానిని నిలబెడితే కచ్చితంగా గెలుస్తారనే ధీమా వైసీపీ వర్గాల్లో ఉంది. కొడాలి నానికి కమ్మ సామాజికవర్గంతో పాటు బీసీ, కాపు, ఇతర సామాజిక వర్గాల వారితో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో ఆయనను ఎలాగైనా ఒప్పించి పోటీలోకి దింపాలని వైసీపీ అధినాయకత్వం ప్రయత్నాలు చేస్తోన్నట్లు ప్రచారం జరిగింది.

తన సొంత నియోజకవర్గమైన గుడివాడ నుంచే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు కొడాలి నాని ఆసక్తిగా ఉన్నారు. గుడివాడను వదులకునేందుకు అసలు సిద్దంగా లేరు. కానీ జగన్ చెప్పితే కొడాలి నాని ఒప్పుకుంటారని, జగన్ మాట కాదనరని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తానికి విజయవాడ లోక్ సభ స్థానంలో జెండా ఎగురవేయాలని భావిస్తున్న వైసీపీ… నానిని రంగంలోకి దింపే యోచనలో ఉందనే వార్త హల్ చల్ చేస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -