Kodali Nani: కొడాలి నానికి ఇవే చివరి ఎన్నికలట.. టీడీపీ గెలుస్తుందనే భయంతో అలా చెబుతున్నారా?

Kodali Nani: వైసిపి పార్టీలో ఫైర్ బ్రాండ్ గా పేరు సంపాదించుకున్నటువంటి వారిలో కొడాలి నాని ఒకరు. ఈయన టిడిపి అధినేతలపై టిడిపి కార్యకర్తలపై తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ పెద్ద ఎత్తున వార్తలలో నిలుస్తుంటారు నారా లోకేష్ రెడ్డి బుక్ లో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని పేరు ఉంటుంది. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు లోకేష్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఉంటారు.

ఇకపోతే త్వరలోనే ఎన్నికలు రాబోతున్నటువంటి తరుణంలో కొడాలి నాని చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈయనకు టికెట్ వస్తుందో రాదో కూడా ఇప్పటికీ తెలియడం లేదు అయితే తనని ఈసారి ఎన్నికలలో గెలిపించాలని ఇవే నా చివరి ఎన్నికలు అంటూ కొడాలి నాని చేసినటువంటి ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

కొడాలి నాని ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారో అర్థం కాలేదు కానీ ఆయన మాత్రం ఇప్పుడు తన వయసు 53 సంవత్సరాల అని వచ్చే ఎన్నికలకు 58 సంవత్సరాలు అవుతాయి తాను అప్పుడు పోటీ చేయలేనని తెలుపుతున్నారు. ఇక తన వారసులు రాజకీయాలలోకి వచ్చే అవకాశాలు కూడా లేవు ఈయనకు ఇద్దరు కుమార్తెలు కావడంతో వారికి రాజకీయాలపై కూడా ఆసక్తి లేదని తెలుస్తోంది.

కొడాలి నాని ఇవే నా చివరి ఎన్నికలు అనడం వెనుక మరో కారణం ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం ఈయనకు ఎన్నో అనారోగ్య సమస్యలు ఉన్నాయని తనని దగ్గరగా చూసిన వారు చెబుతున్నారు ఇది ఒక కారణమైనప్పటికీ ఈయన టిడిపిపై భారీ స్థాయిలో నోరు పారేసుకున్నారు టిడిపి అధికారంలోకి వస్తే ఈయన ఆంధ్రాలో అడుగుపెట్టే అవకాశాలు కూడా ఉండవని అదే భయంతోనే ఈసారి ఎలాగైనా తనని గెలిపించాలని కూడా అభ్యర్థిస్తున్నారు. ఒకవేళ టీడీపీ గెలిచి ఈయన ఎమ్మెల్యేగా గెలిచిన ఇబ్బంది తప్పదు. అందుకే ఇవే నా చివరి ఎన్నికలని ఈసారి గెలిపించాలని ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -