RK Roja: తెలుగుదేశం పార్టీతో చేతులు కలిపిన రోజా ప్రత్యర్థులు.. ఏం జరిగిందంటే?

RK Roja: నగరి నియోజకవర్గంలో ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి సినీనటి మంత్రి రోజా ఇప్పటికే నగరి నుంచి రెండుసార్లు ఎన్నికలలో పోటీ చేసి విజయం సాధించారు. అయితే మూడోసారి కూడా తాను కచ్చితంగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2014 2019 సంవత్సరంలో రోజా నగరీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే స్వల్ప మెజారిటీతో మాత్రమే బయటపడ్డారు.

ఇకపోతే మూడోసారి కూడా ఈమెకు నగరి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇవ్వడంతో గెలుస్తానన్న ధీమా రోజా వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆమెకు మద్దతు తెలిపేవారు ఎవరూ లేరు. సొంత పార్టీ నేతలందరూ కూడా రోజాకు టికెట్ ఇవ్వడం ఇష్టం లేకపోవడంతో వారందరూ తాము రోజాకు టికెట్ ఇస్తే మద్దతు తెలుపమని ఆమెకు టికెట్ కేటాయించక ముందే పార్టీ అధినేతకు తెలియజేశారు.

ఇలా నగరిలో తనకు సపోర్ట్ చేయమని సొంత పార్టీ నేతలు చెప్పినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం లెక్కచేయకుండా రోజాకే టికెట్ కేటాయించారు. దీంతో వైసిపి నేతలందరూ కూడా టీడీపీకి ప్రత్యక్షంగాను పరోక్షంగాను మద్దతు తెలియజేస్తూ రోజా ఓటమికి కారణం అవుతున్నారు. ఇక ఇటీవల రోజా నామినేషన్ కూడా పూర్తి అయింది అయితే ఈ నామినేషన్ కి ఏ విధమైనటువంటి స్పందన రాలేదని చెప్పాలి.

తన సొంత జిల్లాలో మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నగరి నియోజకవర్గ గెలుపు బాధితులను జగన్మోహన్ రెడ్డి అప్పగించిన ఈయన పెద్దగా పట్టించుకోలేదని తెలుస్తుంది. దీంతో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని ఆహ్వానించి నామినేషన్ వేశారు. ఎవరు పెద్దగా తరలి రాకపోవడంతో అక్కడ రోజా ఓటమి ఖాయమని స్పష్టంగా తెలుస్తోంది. మరి స్వల్ప మెజారిటీతో గత ఎన్నికలలో బయటపడిన రోజా ఈసారి ఎలాంటి విజయం అందుకోబోతుందో తెలియాల్సింది.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -