Komati Reddy Venkata Reddy: రాజకీయాలకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గుడ్ బై చెబుతారా?

Komati Reddy Venkata Reddy: భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజీకీయాలకు గుడ్ బై చెప్పనున్నారా.. వచ్చే ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుని రాజకీయాలను వదిలేస్తారా.. అంటే అవుననే ప్రచారం జరుగుతోంది. దాదాపు 30 ఏళ్లుగా కోమటిరెడ్డి వెంకరటరెడ్డి రాజకీయాల్లో ఉన్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా పనిచేశారు. రాజకీయాల్లో ఎన్నో సంవత్సరాలుగా ఉన్నానని, ఇక రాజకీయాలను వదిలేయాలని అనిపిస్తోందంటూ ఆస్ట్రేలియా పర్యటనలో తనను కలిసిన అభిమానులతో వెంకటరెడ్డి మాట్లాడిన వీడియో బయటకు వచ్చింది. రాజకీయాలకు ఇక చారని, ఇక గుడ్ బై చెప్పాలని అనిపిస్తోందంటూ వ్యాఖ్యానించారు. దీంతో రాజకీయాలకు వెంకటరెడ్డి గుడ్ బై చెబుతారనే ప్రచారం జరుగుతోంది.

రాజగోపాల్ రెడ్డి తొలి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. వేరే పార్టీల్లోకి వెళ్లకుండా కాంగ్రెస్ పార్టీనే నమ్ముకుని ఉన్నారు. నల్గొండ జిల్లాలో ఆయనకు మంచి పేరుంది. భారీగా అభిమానులు కూడా ఆయనకు ఉన్నారు. అయితే పార్టీలో ఎప్పటినుంచో సీనియర్ నేతగా ఉన్న తనకు పీసీసీ పదవి ఇవ్వకపోవడంపై ఆయన అసంతృప్తిగా ఉన్నారు. సీనియర్ నేతగా, పార్టీని నమ్ముకున్న నేతను తనను కాదని టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డికి ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. రేవంత్ రెడ్డికి సహకరించకుండా పార్టీలో అసంతృప్త గళం వినిపస్తున్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్టానంపై ఆయన తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. అలాగే తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళ్లడం, వెంకటరెడ్డి ఆ పార్టీలో చేరడం ఇష్టంలేకపోవడంతో రాజకీయాల నుంచే తప్పుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.

వెంకటరెడ్డి కాంగ్రెస్ కు అత్యంత నమ్మకస్తుడిగానే ఉన్నారు. కాంగ్రెస్ వాదిగానే ఉండటం ఇష్టమని ఆయన అనేకసార్లు తెలిపారు. ప్రాణం ఉన్నంతవరకు కాంగ్రెస్ పార్టీ నేతగా ఉంటానంటూ అనేకసార్లు తెలిపారు. దీంతో వేరే పార్టీలో చేరేందుకు ఆయన ఇష్టపడటం లేదు. అయితే రాజగోపాల్ రెడ్డి బీజేపీలోనే ఉండటం, వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండటం ఇరు పార్టీలలో కోమటిరెడ్డి బ్రదర్స్ పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇద్దరూ చెరోక పార్టీలో ఉండటంతో సేఫ్ గేమ్ ఆడుతున్నారనే అనుమానాలు బీజేపీ, కాంగ్రెస్ లో వినిపస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ లో రేవంత్ తో పొసగకపోవడం, బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపకపోవడంతో వెంకటరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక మునుగోడు ఉపఎన్నికలో తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి ఓటేయాలని పలువురు కాంగ్రెస్ నేతలకు వెంకటరెడ్డి ఫోన్ చేసి చెప్పిన ఆడియో లీక్ అయింది. అంతేకాకుకండా మునుగోడులో కాంగ్రెస్ గెలవదంటూ ఆస్ట్రేలియాలో తనను రిసీవ్ చేసుకోడానికి వచ్చిన అభిమానులతో వెంకటరెడ్డి వ్యాఖ్యానించిన వీడియో బయటకు వచ్చింది. దీనిపై కాంగ్రెస్ అధిష్టానికి టీ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. దీనిపై సంజాయిషీ ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ హైకమాండ్ వెంకటరెడ్డికి నోటీసులు జారీ చేసింది. మునుగోడు ఉపఎన్నికల తర్వాత వెంకటరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. పార్టీ నుంచి సస్పెన్షన్ వేటు వేస్తే.. వేరే పార్టీలోకి వెళ్లడమే లేదా.. రాజకీయాల నుంచి తప్పుకోవడమో చేయాలి. కానీ వేరే పార్టీలో చేరడం ఇష్టం లేని వెంకటరెడ్డి.. రాజకీయాల నుంచి తప్పుకునే అవకాశముందని చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

AP Recruitments: ఎలాంటి రాతపరీక్ష లేకుండా రూ.50,000 వేతనంతో జాబ్.. ఎలా దరఖాస్తు చేయాలంటే?

AP Recruitments:  నిరుద్యోగులకు శుభవార్త, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఏపీ ప్రభుత్వం జాబ్ నోటిఫికేషన్ ని తీసుకువచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్య వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ జిల్లా...
- Advertisement -
- Advertisement -