Krishna: భార్యను చూసి పిల్లాడిలా ఏడ్చేసిన కృష్ణ.. ఆరోజు ఏం జరిగిందంటే?

Krishna: టాలీవుడ్ ప్రేక్షకులకు సూపర్ స్టార్ కృష్ణ గురించి పెద్దగా పరిచయంకర్లేదు. ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలో నటించి నటుడుగా తనకంటూ చెరగని ముద్ర సంపాదించుకున్నాడు. 1970, 80 సంవత్సరంలో అప్పట్లో టాలీవుడ్ అగ్రస్టార్ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ క్రమంలోనే సూపర్ స్టార్ గా ఒక బ్రాండ్ తన సొంతం చేసుకున్నాడు.

తేనె మనసులు సినిమా తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన కృష్ణ ఆ తర్వాత గూడచారి 116 సినిమాతో సినీ ఇండస్ట్రీలో హీరోగా గుర్తింపు సంపాదించుకున్నాడు. దాదాపు 340 సినిమాలకు పైగా కృష్ణ ప్రధాన పాత్రలో నటించాడు. కృష్ణా నటుడు గానే కాకుండా దర్శకుడుగా కూడా ఇండస్ట్రీలో 16 సినిమాలకు ప్రాణం పోసాడు. అనంతరం సొంతంగా హైదరాబాదులో పద్మాలయ స్టూడియోస్ నిర్వహించాడు. అలా ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా, దర్శకుడుగా ఓ వెలుగు వెలిగాడు సూపర్ స్టార్ కృష్ణ.

ఇక ప్రస్తుతం కృష్ణ గారి వయసు సినిమాలో నటించడానికి సహాయ పడకపోవడం తో సినిమాలకు నటన పరంగా దూరంగా ఉంటున్నాడు. ప్రస్తుతం సూపర్ సార్ కృష్ణ వారసుడు సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రస్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నాడు. ఇదంతా పక్కన పెడితే సూపర్ స్టార్ కృష్ణ ఇంట్లో ఒక తీవ్రమైన విషాదం నెలకొంది. కొన్ని గంటల క్రితం సూపర్ స్టార్ కృష్ణ మొదటి భార్య ఇందిరా దేవి మరణించారు. ఈ విషయాన్ని మహేష్ బాబు అభిమానులు ఏమాత్రం తీసుకోలేకపోతున్నారు.

కాగా ఇందిరా దేవి పార్థివ దేహాన్ని చూడడానికి సినీ ప్రముఖులు కొందరు హాజరయ్యారు. కాగా ఈ నేపథ్యంలో కృష్ణ గారి కుటుంబంలో గతంలో చనిపోయిన వారికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా కృష్ణ గారి పెద్ద కుమారుడు రమేష్ బాబు చనిపోతే తన తల్లి ఇందిరా దేవి రమేష్ బాబు పార్థివదేహాన్ని చూసి ఏమాత్రం తట్టుకోలేకపోయింది. అప్పుడు ఇందిరా దేవి బాధను చూడలేక కృష్ణ కూడా కంట కన్నీరు పెట్టుకున్నాడు. ఇందిరా దేవి బాధపడితేనే చూడలేని కృష్ణ ఇప్పుడు ఇందిరా దేవి గారి మరణించిన వార్త తీసుకోలేకపోతున్నారు.

Related Articles

ట్రేండింగ్

YS Sharmila: జాబు రావాలంటే జగన్ పోవాలి.. వైరల్ అవుతున్న షర్మిల సంచలన వ్యాఖ్యలు!

YS Sharmila: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల నవ సందేహాలు పేరిట వైయస్ జగన్మోహన్ రెడ్డికి బహిరంగంగా లేఖ రాశారు ఈ లేఖ ద్వారా గత ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన...
- Advertisement -
- Advertisement -