Krishnagiri: పరాయి మగాళ్ళతో సంబంధం పెట్టుకున్న భార్య.. ఏకంగా పోలీస్ ని హత్య?

Krishnagiri: దేశవ్యాప్తంగా రోజురోజుకీ వివాహేతర సంబంధాల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. పురుషులతో పోల్చుకుంటే మహిళలు ఎక్కువగా అక్రమ సంబంధాలకు పాల్పడుతున్నారు. తాళి కట్టిన భర్తను కాదనుకున్న మహిళలు ఇతర పురుషులతో వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం మాత్రమే కాకుండా అడ్డొచ్చిన భర్తను సైతం చంపడానికి వెనుకాడడం లేదు. వివాహేతర సంబంధాల మోజులో పడి వారి చేతులతో వారి పసుపు కుంకాలను వారే నాశనం చేసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా కల్లాలి ప్రాంతం. ఇక్కడే సెంథిల్, చిత్ర అనే దంపతుల నివాసం ఉంటున్నారు.

 

సెంథిల్ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తుండగా, భార్య ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నారు. దంపతులు ఇద్దరూ పోలీస్ డిపార్ట్ మెంట్ లో పని చేస్తూ నలుగురిలో గౌరవప్రదంగా జీవిస్తున్నారు. అలా వీరి సంసారం సంతోషంగా సాగుతున్న తరుణంలోనే భార్య చిత్ర పక్క చూపులు చూసింది. ఇంట్లో భర్త ఉండగా పరాయి మగాళ్ల పై మోజు పడింది. విషయం ఏంటంటే? భార్య చిత్ర స్థానికంగా ఉండే ఓ వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని నడిపిస్తూ వచ్చింది. అలా చాలా కాలం పాటు చిత్ర ప్రియుడితో తెగ ఎంజాయ్ చేస్తూ వచ్చింది. అయితే ఎట్టకేలకు చిత్ర వివాహేతర సంబంధం గురించి భర్తకు తెలిసింది. దాంతో భర్త చిత్ర పై కోప్పడి ఆమె ప్రవర్తనను మార్చుకోమని చెప్పాడు. లేకపోతే అంతు చూస్తానని వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఆ సమయంలో చిత్రకు ఏం చేయాలో తెలియక తన భర్తనే లేకుండా చేస్తే ప్రియుడితో ఎంజాయ్ చేయొచ్చు కదా అని భావించింది.

 

దాంతో తన ప్లాన్ మేరకు చిత్ర కొందరు తెలిసిన వ్యక్తులతో భర్తను హత్య చేయించేందుకు సుపారీ ఇచ్చింది. ఇక అనుకున్న ప్రకారమే చిత్ర చెప్పిన విధంగా రౌడీలు సెంథిల్ ను దారుణంగా హత్య చేసి చంపేశారు. ఇక చిత్ర ఏమీ తెలియనట్టుగా తన భర్త కనిపించడం లేదు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు చిత్ర ఫోన్ కాల్ లిస్ట్ చెక్ చేశారు. దాంతో ఆమెపై వారికి అనుమానం వచ్చింది. ఇక పోలీసులు తమదైన శైలిలో సిద్ధంగా విచారించడంతో ఆమె అసలు విషయం బయట పెట్టేసింది. తన ప్రియుడితో కలవడానికి తన భర్త అడ్డు తొలగించిన్నట్లు చిత్ర పోలీసులకు తెలిపింది. దాంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు చిత్ర తో పాటు ఆ హత్యకు పాల్పడిన హంతకులను కూడా అరెస్టు చేశారు. అయితే ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Related Articles

ట్రేండింగ్

Viveka Case: వివేకా హత్య కేసులో సునీతకు వరుస షాకులు.. ఏం జరిగిందంటే?

Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. అవినాష్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దేశం విడిచి వెళ్ళకూడదని, సీబీఐ విచారణకు...
- Advertisement -
- Advertisement -