KTR: కేసీఆర్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన కేటీఆర్.. ఏం చెప్పారంటే?

KTR: రాజకీయ నాయకులు సమాజాన్ని బాగు చేయడం కోసం తమ టాలెంట్ చూపించరు కానీ మాటలతో అరచేతిలో స్వర్గం చూపించడానికి మాత్రం తమ టాలెంట్ ఉపయోగిస్తారు. వాళ్ల మాటలు వాళ్లు చెప్పుకునే గొప్పలు ఎలా ఉంటాయి అంటే వాళ్ల ముందు పిట్టలదొర కూడా బలాదూరే.

 

ఇప్పుడు తెలంగాణ మంత్రి కేటీఆర్ మీద ఇలాంటి జోకులు వినిపిస్తున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే హైదరాబాద్ నానక్ రాంగూడా లో నిర్మించిన క్రెడాయి కార్యాలయ ప్రారంభోత్సవానికి మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. స్వయంగా ఆయన తండ్రి, తెలంగాణ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు నాయుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కలిస్తే ఒక కెసిఆర్ అని చెప్పుకు వచ్చిన కేటీఆర్ తను అలా ఎందుకన్నాడో కారణం కూడా చెప్పారు. చంద్రబాబు నాయుడుకి ప్రో బిజినెస్ బ్రో ఐటి ఇమేజ్ అజెండా ఉండేదని వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ప్రో ఫార్మర్ ప్రో రూరల్ ఇమేజ్ ఉండేదని చెప్పుకొచ్చారు.

 

అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి మాత్రం ఈ రెండు ఇమేజ్లు కలిపి వచ్చాయని వాళ్ళు ఒక్కొక్క రంగాన్ని అభివృద్ధి చేయడానికి దృష్టి పెట్టారు కానీ కెసిఆర్ అన్ని రంగాల మీద దృష్టి పెట్టి కేవలం 9 సంవత్సరాల్లో తెలంగాణకి ఎవరు ఊహించని అభివృద్ధి తీసుకువచ్చారు అని చెప్పుకొచ్చారు కేటీఆర్.

 

ఇంత చేస్తున్న కూడా కేంద్రంలో ఉన్న మోడీ సర్కార్ కు తెలంగాణ ప్రభుత్వం ఇష్టం లేదని.. అయినా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతి పథకాన్ని కేంద్రం కాపీ కొడుతుందని ఆరోపించారు. కేసీఆర్ ఇప్పటికీ తన పాలనలో ట్రైలర్ ని మాత్రమే చూపించారని అసలు సినిమా ముందు ఉంటుందని చెప్పుకొచ్చారు.

 

ఈ మాటలు ఇప్పుడు వైరల్ గా మారడంతో కేటీఆర్ మాటలు మరీ అతిగా ఉన్నాయి.. మరి ఇంతగా పొగుడుకోవటం అవసరమా అంటూ కేటీఆర్ మాటలను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్.

 

Related Articles

ట్రేండింగ్

YSRCP Manifesto: వైసీపీ మేనిఫెస్టోలో మాయమైన ఈ స్కీమ్ గురించి తెలుసా.. మహిళలంటే లోకువా?

YSRCP Manifesto: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇటీవల తన ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో ఏ విధమైనటువంటి హామీలు ఇవ్వబోతున్నారని...
- Advertisement -
- Advertisement -