BRS Leader KTR: దేశంలో నిరుద్యోగానికి ఇది సాక్ష్యం కాదా.. వైరల్ అవుతున్న కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

BRS Leader KTR: మనదేశంలో నిరుద్యోగం పూర్తి స్థాయిలో పెరిగిపోయిందనే విషయం మనకు తెలిసిందే. ఇలా ఎన్నో ఉన్నతమైన చదువులు చదివినటువంటి వారు కూడా ఉద్యోగాల పేటలో ఎంతో కష్టపడుతున్నారు. అయితే తాజాగా నిరుద్యోగ విషయం గురించి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది. ఐఐటీ నుంచి ఇటీవల గ్రాడ్యూయేషన్ పూర్తి చేసుకున్న 36 శాతం మందికి ఉద్యోగాలు లేవన్న వార్తా కథనంపై బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.

ప్రతిష్టాత్మకమైన ఐఐటీలలో చదివిన విద్యార్థులు కూడా ఉద్యోగం కోసం కష్టపడుతున్నారని.. అది దేశంలో నిరుద్యోగానికి నిదర్శనం కాదా అని ప్రశ్నించారు. కొత్త కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్న తరుణంలో.. ప్రపంచంలో అత్యధిక యువకులు ఉన్న దేశంగా ఇది చర్చించుకోవాల్సిన విషయమని ఈయన తెలియజేశారు.

ప్రఖ్యాత ఐఐటీ బాంబేలో ఇటీవల నిర్వహించిన క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఏకంగా 36 శాతం మందికి ఉద్యోగం రాకపోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 2024 క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ కోసం 2000 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా వారిలో 36 శాతం మంది.. అంటే 712 మందికి ఉద్యోగాలు రాలేదు. ప్లేస్‌మెంట్స్ పరంగా 2021, 2022 సంవత్సరాల్లో ఐఐటీ బాంబే దేశవ్యాప్తంగా మూడో ర్యాంకులో నిలిచింది.

గతేడాది నాలుగో స్థానానికి పడిపోయింది. ఐఐటీ మద్రాస్‌లోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. ఈ విధంగా దేశంలో పెరిగిపోతున్నటువంటి నిరుద్యోగం గురించి కేటీఆర్ ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

Related Articles

ట్రేండింగ్

Andhra Pradesh Assembly Elections: గులకరాళ్లతో, పసుపు చీరలతో రాజకీయాలు.. ఏపీ పరిస్థితి ఇంత దారుణంగా ఉందా?

Andhra Pradesh Assembly Elections: మరొక రెండు వారాలలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలు కూడా జరగబోతున్నటువంటి నేపథ్యంలో రాజకీయ వేడి రాజుకుంది. ఈ విధంగా ఎన్నికల త్వరలో జరగబోతున్నటువంటి...
- Advertisement -
- Advertisement -