Lakshmi Parvathi: సీనియర్ ఎన్టీఆర్ చనిపోవడానికి కూతురే క్షుద్రపూజలు చేయించిందా.. ఏం జరిగిందంటే?

Lakshmi Parvathi: స్వర్గీయ నటుడు నందమూరి తారక రామారావు గురించి మనందరికీ తెలిసిందే. సీనియర్ ఎన్టీఆర్ తెలుగు సినిమా చరిత్రకి గర్వకారణం అని చెప్పవచ్చు. తెలుగు సినిమాలలో ఆయన నటించని పాత్ర అంటూ ఏదీ లేదని చెప్పవచ్చు. అంతేకాకుండా పౌరాణిక పాత్రలకు ప్రాణం పోసిన ఏకైక నటుడు నందమూరి తారక రామారావు. కేవలం సినిమాల పరంగా మాత్రమే కాకుండా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి రాజకీయాల్లో కూడా ప్రభంజనాన్ని సృష్టించారు. అప్పట్లో ఎన్నికలకు ఆరు నెలల ముందు తెలుగు దేశం పార్టీని స్థాపించి 270 కి పైగా స్థానాల్లో గెలుపొంది, ప్రభుత్వాన్ని స్థాపించి చరిత్ర సృష్టించాడు.

అప్పట్లో ఎన్టీఆర్ సృష్టించిన ప్రభంజనంని అందుకునే రేంజ్ లో ఇప్పటి వరకు ఎవ్వరూ దరిదాపుల్లోకి కూడా రాలేకపోయారు. ఇక ఆయన చనిపోయిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు తెలుగు దేశం పార్టీ పగ్గాలను చేపట్టి, మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యి, తెలుగు దేశం పార్టీని ఎంతో పటిష్టంగా, బలమైన శక్తిగా ముందుకు తీసుకెళ్లారు. అయితే సీనియర్ ఎన్టీఆర్ వృద్ధాప్యంలో లక్ష్మీపార్వతి అనే ఆమెను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

ఈమెకి నందమూరి కుటుంబం మొత్తం వ్యతిరేకం,కేవలం ఈమె కారణంగానే ఎన్టీఆర్ కొడుకులు కూతుర్లు ఎన్టీఆర్ తో గొడవలు పెట్టుకొని విడిపోయారని ఎప్పటి నుండో ఇండస్ట్రీలో ఉన్న టాక్. లక్ష్మీ పార్వతి అప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేస్తూనే ఉంది. సమయం సందర్భం వచ్చిన ప్రతిసారి నందమూరి ఫ్యామిలీని టార్గెట్ చేస్తూనే ఉంటుంది లక్ష్మీపార్వతి.

ఇటీవల ఆమె మీడియాతో మాట్లాడుతూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. అదేమిటంటే ఎన్టీఆర్ కూతురు అలియాస్ చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి ఆ రోజుల్లో ఎన్టీఆర్ చనిపోవాలని, తన కొడుకు ముఖ్య మంత్రి అవ్వాలని క్షుద్ర పూజలు చేసిందంటూ మీడియా ముందు బాంబు పేల్చింది. అంతేకాదు చంద్రబాబు నాయుడు నీచుడు అని తెలిసి కూడా, తండ్రికి వెన్నుపోటు పొడవడం లో భువనేశ్వరి పాత్ర చాలా ఉందంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -