Chiranjeevi: చిరంజీవికి దేవునితో సమానమైన ఇద్దరు వ్యక్తులు ఎవరో తెలుసా?

Chiranjeevi: విశాఖపట్నంలో లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ పుణ్యతిధి, ఏఎన్ఆర్ శతజయంతి వేడుకలు జరుగుతున్నాయి. అలాగే ఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాహిత్య పురస్కారం, జీవన సాఫల్య పురస్కారాల అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి నేడు ముఖ్యఅతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లతో ఆయనకి గల అనుభవాలను పంచుకున్నారు.

 

ఎన్టీఆర్ ఏఎన్నార్ ఇద్దరూ సినీ పరిశ్రమకు రెండు కళ్ళు వంటి వారు. ఇద్దరూ తనకు దైవ సమానులని తనకు ఎన్నో మంచి సలహాలు ఇచ్చారని చెప్పుకొచ్చారు. వారితో కలిసి నటించడం తన పూర్వ జన్మ సుకృతం అన్నారు చిరంజీవి. నేను ఇండస్ట్రీలో అప్పుడప్పుడే ఎదుగుతున్నాను ఒకరోజు ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళినప్పుడు రండి బ్రదర్ కూర్చోండి అన్నారు. నేను భయం భయంగా కూర్చున్నాను.

అప్పుడు ఆయన ఒక మాట చెప్పారు. మీరు సంపాదించిన డబ్బు అంతా ఇనుప ముక్కల మీద పెట్టొద్దు. ఏదైనా మంచి ఇల్లు కట్టుకోండి, స్థలాలు మీద పెట్టుకోండి మనల్ని కాపాడేది అదే అన్నారు. ఎక్కువగా కాలం స్టార్ డం తో ఉంటామని అనుకోకండి అంటూ ముందుచూపుతో చక్కని సలహా ఇచ్చారు. అదే సమయంలో నేను అప్పట్లో స్టైలిష్ కారు టయోటా ని కొనుక్కుందాం అనుకున్నాను కానీ ఎన్టీఆర్ గారు చెప్పిన తర్వాత కారు కొనడం ఆపేసి స్థలాలు కొనడం మొదలు పెట్టాను.

 

ఈరోజు నా రెమ్యూనరేషన్ కంటే ఆ స్థలాలే నన్ను నా ఫ్యామిలీ ని కాపాడుతున్నాయి అని చెప్పుకొచ్చారు చిరంజీవి. అలాగే యండమూరి వీరేంద్రనాథ్ గురించి మాట్లాడుతూ సమకాలీన రచయితలలో యండుమూరి వీరేంద్రనాథ్కి ఎవరూ సాటి లేరు. యండమూరి రాసిన అభిలాష నవల ఆధారంగా తెరకెక్కిన సినిమాతోనే సినీ పరిశ్రమలో తనకు స్థానం సుస్థిరమైందని చెప్పారు. తన బయోగ్రఫీ రాసుకునే సమయం తనకు ఉండదని అందుకే ఆ బాధ్యతను యండమూరి కి అప్పగిస్తున్నానని చెప్పారు.

Related Articles

ట్రేండింగ్

Bobbili Constituency: బొబ్బిలి నియోజకవర్గం టీడీపీ లెక్కలు మార్చబోయే నేతలు వాళ్లేనా.. ఏమైందంటే?

Bobbili Constituency:  గత మూడు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ బొబ్బిలిలో జెండా ఎగరవేయాలని చూస్తోంది కానీ ఎందుకో ఆ నియోజకవర్గం తెలుగుదేశానికి పెద్దగా కలిసి రావటం లేదు. 1983లో నందమూరి తారక రామారావు...
- Advertisement -
- Advertisement -