Pawan Kalyan-Chandrababu: ఆ విషయంలో వైసీపీ స్లో అయిందా.. అలా జరిగితే చంద్రబాబు పవన్ లకు ఇబ్బందేనా?

Pawan Kalyan-Chandrababu: మరొక రెండు నెలలలో తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే అన్ని పార్టీ నాయకులు తమకు అనుకూలంగా ఉన్న పార్టీలోకి జంప్ అవుతూ ఆ పార్టీకే మద్దతు తెలియజేస్తున్నారు. ఇలా ఎన్నికల సమయంలో నాయకులు పార్టీ కండువాలను మార్చుకోవడం సర్వసాధారణంగా జరిగే అంశం అయితే ఈసారి మాత్రం తెలంగాణలో నాయకులు పార్టీలు మారడం కాస్త ఎక్కువగానే కనబడుతుంది. ఒకసారి ఓడిపోయిన తర్వాత ఐదు సంవత్సరాల పాటు రాజకీయాలకు దూరంగా ఉండాలి అంటే ఎంతో ఇబ్బంది కనుక తమకు అనుకూలంగా ఉన్నటువంటి పార్టీలో ఉండటానికి నాయకులు ఆసక్తి చూపుతున్నారు.

ప్రస్తుతం తెలంగాణలో ఇదే కొనసాగుతుంది అయితే 2024 ఆంధ్రప్రదేశ్లో జరగబోయే ఎన్నికల సమయానికి కూడా ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి పరిస్థితి కనపడుతుంది. అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి ఎన్నికల బరిలో దిగిపోతున్న సంగతి మనకు తెలిసిందే ఇక చంద్రబాబు నాయుడు అరెస్టు కావడంతో పార్టీ కూడా మరింత బలహీన పడింది అనే విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలోనే నాయకులు కూడా ఇటు తేల్చుకోలేని పరిస్థితులలో ఉన్నారు.

ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి రాజకీయ నాయకులు మారబోతున్నారు అంటే వారికి ఏదో ఒక విధంగా ఆశ చూపించి తమ పార్టీలో పెట్టుకోవడం జరుగుతుంది ఎమ్మెల్సీ అనే ఆప్షన్ ఒకటి ఉంది అలాగే నామినేటెడ్ పదవులు డబ్బు ఆశ చూపించి కూడా తమ పార్టీలోనే నాయకులను ఉంచడానికి సదరు పార్టీ నేతలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. అయితే తెలంగాణలో ఇలాంటివి చాలా అవలీలుగా జరుగుతున్నప్పటికీ ఆంధ్రాలో ఇలా నాయకులకు ఆశ చూపించి పార్టీలోకి తీసుకునే విషయంలో వైసిపి బాగా స్లో అయిందని చెప్పాలి .

ఇక జనసేన పార్టీకి టికెట్ ఇచ్చిన చోట తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కడ పోటీ చేయడానికి ఇష్టపడటం లేదు ఇలాంటి వారి చూపు అంతా కూడా జగన్ పార్టీ వైపే ఉంది. అంతేకాకుండా జగన్ ఒకసారి మాట ఇచ్చారు అంటే మాట నిలబెట్టుకుంటారు. ఇక డబ్బు ఇవ్వడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నారు. గత ఐదు సంవత్సరాలుగా ప్రభుత్వంలో కొనసాగుతున్నారు కనుక డబ్బు విషయంలో కూడా ఇలాంటి డోకా ఉండదు కానీ వారిని తమ పార్టీలోకి ఆహ్వానించే విషయంలో మాత్రమే వైసిపి స్లోగా ఉందని ఒకవేళ జగన్ మోహన్ రెడ్డి తమ పార్టీలోకి ఆహ్వానిస్తే మాత్రం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కు భారీ దెబ్బ పడబోతుందని తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -