Liger: లైగర్ సినిమాకు దారుణమైన రేటింగ్ ఇచ్చిన IMBD.. మరి ఇంత తక్కువా?

Liger: డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటించిన చిత్రం లైగర్. బాక్సింగ్ నేపథ్యంలో తెరికెక్కిన ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ఆగస్టు 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఇటు సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా అటు నార్త్ ఇండస్ట్రీలో కూడా పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించి సినిమా పై భారీ హైప్ క్రియేట్ చేశారు.

ఇలా ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా ఆగస్టు 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అయితే ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను ఏమాత్రం చేరుకోలేక చివరికి విజయ అభిమానుల సైతం ఈ సినిమాపై తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో పూరి జగన్నాథ్ మార్క్ ఎక్కడ కనిపించలేదని, సినిమా విషయంలో విజయ్ అభిమానులు నిరాశ వ్యక్తం చేశారు.ఇక ఈ సినిమా డిజాస్టర్ టాక్ సొంతం చేసుకోవడంతో ఎంతోమంది ఈ సినిమాపై స్పందిస్తూ సినిమాలో కంటెంట్ ఉంటేనే అభిమానులు ఆదరిస్తారు లేదంటే లేదని మరోసారి ఈ సినిమా నిరూపించుకుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇలా ఆగస్టు 25వ తేదీ విడుదలై డిజాస్టర్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమాకు IMBD చెత్త రేటింగ్ ఇచ్చింది. ఈ క్రమంలోనే 10 కి గాను లైగర్ సినిమాకి 1.7 రేటింగ్ ఇవ్వడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మరి ఈ సినిమా ఇలాంటి దారుణమైన రేటింగ్ సొంతం చేసుకోవడం విజయ్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఇటీవల కాలంలో విడుదలై ఫ్లాప్ గా నిలిచిన అమీర్ ఖాన్ లాల్ సింగ్ చెందా సినిమాకి IMBD 5 రేటింగ్ ఇవ్వగా అక్షయ్ కుమార్ రక్షాబంధన్ సినిమాకు4.6 రేటింగ్ ఇచ్చింది.

ఇకపోతే నటి తాప్సి నటించిన దొబేర సినిమాకు 2.9 రేటింగ్ ఇచ్చిన IMBD విజయ్ దేవరకొండ లైగర్ సినిమాకు మాత్రం దారుణంగా 1.7 రేటింగ్ ఇవ్వడం గమనార్హం. ఇలా ఈ సినిమా డిజాస్టర్ టాక్ సొంతం చేసుకోవడమే కాకుండా IMBD రికార్డులో కూడా అత్యంత దారుణమైన రేటింగ్స్ సొంతం చేసుకోవడం చూసి విజయ్ అభిమానులు ఈ సినిమా పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -