Liger: లైగర్ హిట్ కొట్టాలంటే .. ఎంత రాబట్టాలో తెలుసా?

Liger: పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ నటించినటువంటి లైగర్ సినిమా మరో రెండు రోజులలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ఈ సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. విడుదల తేదీ దగ్గర పడటంతో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఇప్పటికే టికెట్ బుకింగ్ కూడా ఓపెన్ కావడంతో భారీ మొత్తంలోనే టికెట్లు బుక్ అయినట్టు తెలుస్తోంది.

ఈ సినిమా విజయ్ కెరియర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కడమే కాకుండా ఆయన కెరియర్లో భారీ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న సినిమాగా కూడా లైగర్ రికార్డ్ సొంతం చేసుకుంది.ఇక ఈ సినిమా ఆగస్టు 25వ తేదీ విడుదల కావడంతో ఈ సినిమాకు జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎప్పుడు లేని విధంగా ఈ సినిమా సీడెడ్ ఏరియాలో మొదటిసారి 9 కోట్ల బిజినెస్ జరుపుకుంది. నైజాం ఏరియాలో 25 కోట్లు ఆంధ్రలో 28 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా 62 కోట్ల బిజినెస్ చేసింది.

ఇక తమిళనాడులో 2.5, కేరళ 1.20, కన్నడ ఇండస్ట్రీలో 5.20 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిపింది. ఇక ఈ సినిమా ఓవర్సీస్ లో 7.5 కోట్ల బిజినెస్ జరగగా, బాలీవుడ్ ఇండస్ట్రీలోపది కోట్ల వరకు బిజినెస్ చేసుకున్నట్లు సమాచారం మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 88.40 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది.

ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ కావాలంటే సుమారు 90 కోట్ల వరకు రాబట్టాల్సి ఉంది. అయితే ఈ సినిమా దూకుడు చూస్తుంటే మాత్రం తొందరగానే ఈ వసూళ్లను రాబడుతుందని అర్థమవుతుంది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా నుంచి విడుదల చేసిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పరచాయి.దీన్ని బట్టి చూస్తుంటే ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ కైవసం చేసుకుంటుందని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -