Nara Lokesh: సీమకు సంచలన హామీలు ఇచ్చిన లోకేశ్.. ఏం చెప్పారంటే?

Nara Lokesh: టిడిపి యువ నేత నారా లోకేష్ ప్రస్తుతం పాదయాత్రలో ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇలా పాదయాత్రలో భాగంగా ఈయన కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే లోకేష్ పాదయాత్రలో నిర్వహించిన సభలో సీమ గురించి మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ కు మొదటి నుంచి రాయలసీమ అంటే కాస్త చులకన భావన అని చెప్పాలి.

రాయలసీమ తమకు ఓటు బ్యాంకు కాదని వారి ఉద్దేశం అందుకే ఇక్కడ అభివృద్ధి చేయడానికి ఏమాత్రం ఆసక్తి చూపించరు. శ్రీ బాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమకు హైకోర్టు లేదా రాజధాని ఇవ్వాల్సి ఉంటుంది. కానీ బాబు హయామములు ఇవి ఏమి జరగలేదు అన్ని కూడా అమరావతిలోనే పెట్టారు.రాజధాని సమయంలో తమకు ఏదో ఒకటి ఇవ్వాలని సీమ ప్రజలు కోరినప్పటికీ చంద్రబాబు నాయుడు వారి కోరికను పెడచెవిన పెట్టారు.

 

ఇక టిడిపి ప్రభుత్వం అధికారం మంచి దిగిపోయి వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా మారిపోయాయో మనకు తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ కి రాజధాని అమరావతి మాత్రమే కాకుండా మూడు రాజధానులు చేయాలని భావించారు. ఈ క్రమంలోనే కర్నూలుకు హైకోర్టు ఇవ్వటానికి వైసిపి ప్రభుత్వం ముందుకు వచ్చింది. అయితే ప్రస్తుతం పాదయాత్రలో ఉన్నటువంటి లోకేష్ అధికారంలో వస్తే సీమకు హైకోర్టు బెంచ్ ఇస్తామని చెప్పడం గమనార్హం.

 

గతంలో ఐదేళ్ల పాలనలో ఉన్నప్పుడు సీమకు లోకేష్ చంద్రబాబు నాయుడు ఏం చేశారు అని లోకేష్ వ్యాఖ్యలపై స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు మరొకసారి అవకాశం ఇస్తే ఏం వెలగ పెడతారు. వైసిపి ప్రభుత్వం హైకోర్టు ఇస్తామని చెప్పగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే బెంచ్ ఇస్తామని ప్రకటించడం విడ్డూరమంటూ లోకేష్ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. తండ్రీత‌న‌యుల హామీల‌ను జ‌నం న‌మ్మే ప‌రిస్థితిలో లేరు. చంద్ర‌బాబు అధికారంలో వుంటే రాయ‌ల‌సీమ నిర్ల‌క్ష్యానికి గురికావ‌డం ప‌రిపాటైంది.

Related Articles

ట్రేండింగ్

Blueberries: ఇవి తింటే మెదడు కంప్యూటర్ కన్నా వేగంగా పని చేస్తుందట.. ఎలా తినాలంటే?

Blueberries: కొన్ని రకాల పండ్లు తినడం వలన అటు ఆరోగ్యానికి, ఇటు మెదడు చురుగ్గా పనిచేయడానికి కూడా ఉపయోగపడతాయి. అటువంటి వాటిలో బ్లూబెర్రీస్ ముందు వరుసలో ఉంటాయి. బ్లూ బెర్రీస్ లో ముఖ్యంగా...
- Advertisement -
- Advertisement -