Lokesh: బ్రహ్మారెడ్డి బతుకుని ‘డైపర్‘గా మార్చిన లోకేశ్.. ఇలాంటి లేకి వ్యాఖ్యలు అవసరమా?

Lokesh: మాచర్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి గురించి మనందరికీ తెలిసిందే. బాబాయి సహా ఏడుగురిని హత్యచేసిన కేసులో ఆయన ప్రధాన నిందితుడు బ్రహ్మారెడ్డి. అటువంటి వ్యక్తిని టీడీపీ అధినేత చంద్రబాబు ఏరికోరి మరీ తిరిగి తీసుకువచ్చి మాచర్ల పార్టీ ఇన్చార్జిగా నియమించిన విషయం తెలిసిందే. అలాంటి ఫ్యాక్షన్, నేర నేపథ్యం ఉన్న జూలకంటి బ్రహ్మారెడ్డి జీవితాన్ని చినబాబు నారా లోకేష్ చాలా సింపుల్ గా తన అజ్ఞానం నిండిన మాటల ప్రవాహంలో పసిపిల్లలకు తొడిగే డైపర్ లాగా మార్చేశారు.

మాచర్లలో ప్రత్యర్థులకు సూసూ పోయించడమే జూలకంటి బ్రహ్మారెడ్డి బాధ్యత అని ప్రకటించి నారా లోకేష్ తన పాదయాత్రలో మరింత సంచలనం సృష్టించారు. మాచర్ల ఇన్చార్జిగా బ్రహ్మారెడ్డిని తెచ్చారంటే.. ఏదో అక్కడ పార్టీకి జీవం పోసి, టీడీపీని మళ్లీ గెలిపించడానికి తెచ్చారేమో అనుకున్నామే ఆయన డ్యూటీ అందరితో సూసూ పోయించడమేనా? అంటూ లోకేష్ అన్న మాటలను విని జనం నవ్వుకుంటున్నారు. కాగా లోకేష్ పాదయాత్రలో భాగంగా తాజాగా మాచర్లలో పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని విమర్శించడం ఆయన రొటీన్ ప్రసంగాల్లో ఒక భాగం అయితే నారాలోకేష్ తెలివితేటలు, పరిజ్ఞానం, భాష మీద ఆయనకున్న పట్టు అందరికీ తెలిసినవే.

 

పిన్నెల్లి అనే పదం పలకడం కూడా చేతకాని లోకేష్ పిల్లి బ్రదర్స్ అంటూ వారికి సూసూ పోయించడానికి బ్రహ్మారెడ్డి అన్నను తీసుకువచ్చాం అంటూ వెల్లడించారు. బ్రహ్మారెడ్డి అన్నను ఇన్చార్జిగా ప్రకటించిన రోజునుంచే వారు సూసూ పోసుకుంటున్నారని కూడా తేల్చిచెప్పారు లోకేష్.
మాచర్లలో అందరితో సూసూ పోయించడం కూసం బ్రహ్మారెడ్డిని పార్టీ పదవిలో నియమించి, ఆ నియోజకవర్గంలో సులభ్ కాంప్లెక్సులను లీజుకు తీసుకోవాలని నారా లోకేష్ అనుకుంటున్నారేమో అంటూ ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు. అయితే మాచర్లలో నారా లోకేష్ ప్రసంగం తరువాత జూలకంటి బ్రహ్మారెడ్డి కూడా బహుశా నా బతుకును లోకేష్ మరీ డైపర్ లాగా మార్చేశాడు అని చింతిస్తుంటారు అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -