Madhavi Latha: పవన్ ను అలాగే పిలుస్తా.. ఏం పీక్కుంటారో పీక్కోండి.. మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

తెలుగు సినీ ప్రేక్షకులకు నటి మాధవి లత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈమె సినిమాల ద్వారా కంటే రాజకీయాల ద్వారానే బాగా పాపులారిటీ సంపాదించుకుందని చెప్పవచ్చు. ఎక్కువగా ఈమె కాంట్రవర్సీల ద్వారా బాగా గుర్తింపు తెచ్చుకుంది. కాగా మొదట తనిష్ హీరోగా నటించిన నచ్చావులే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత స్నేహితుడా సినిమాలో నటించి ప్రేక్షకులకు మరింత చేరువ అయింది. ఆ తర్వాత కొన్ని సినిమాలలో నటించిన మాధవి లత సినిమాలకు విరామం ఇచ్చి రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈమె మరింత పాపులారిటీ సంపాదించుకుంది. అలా రాజకీయ నాయకురాలుగా సినీ నటిగా భారీగా పాపులారిటీని సంపాదించుకుంది మాధవి లత. ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో మరోసారి మాధవి లత పేరు మారుమోగుతోంది. అసలేం జరిగిందంటే.. తాజాగా సెప్టెంబర్ 2 న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు అభిమానులు నెటిజన్స్ పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడంతో పాటు అభిమానులు పవన్ పై ఉన్న అభిమానాన్ని చాటుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మాధవిలత కూడా పవన్ కళ్యాణ్ కీ విషెస్ తెలిపింది.

హ్యాపీ బర్త్ డే టూ యూ మిస్టర్ పవన్ కాళ్యణ్.. గాడ్ బ్లస్ యూ అంటూ విషెస్ తెలిపింది. ఆ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు ఆమెపై మండి పడుతున్నారు. మిస్టర్ పవన్ కళ్యాణ్ అని సంభోడించడం ఏంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆ కామెంట్స్ పై స్పందించిన మాధవి లత..దీనమ్మ జీవితం పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పినందుకు కూడా పెంట పెంట చేస్తున్నారు. మీ బాయ్ ఫ్రెండ్ గారు మొగుడు గారు, తమ్ముడు గారు అని పిలుచుకుంటారేమో కానీ నేను మాత్రం అలా పిలవను. నా మనసుకు నచ్చితే ఏకవచనంతోనే పిలుస్తా. డైరెక్ట్ గా కలిస్తే గారు అని పిలుస్తాను కానీ సోషల్ మీడియాలో ఎలా పిలుస్తారు. మీరు ఏమైనా చేసుకోండి నేను ఇలాగే పిలుస్తాను ఏం పీక్కుంటారో పీక్కోండి అంటూ మండి పడింది మాధవి లత.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ బ్యాలెట్ నంబర్ ఖరారు.. ఓటర్లు సులువుగానే ఓటు వేయొచ్చుగా!

Pawan Kalyan:  జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం బరిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పేరు బ్యాలెట్ ఆర్డర్లో ఎక్కడ ఉందో జనసేన పార్టీ ఒక...
- Advertisement -
- Advertisement -