Magunta Sreenivasulu Reddy: మాగుంట కుమారుడు ఎక్కడ నుంచి పోటీ చేస్తారు?

Magunta Sreenivasulu Reddy: ఒంగోలు వైసీపీ ఎంపీ మాగంటి శ్రీనివాసులు రెడ్డి సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా తాను పోటీయకూడదని నిర్ణయించుకన్నట్లు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా తన కుమారుడు మాంగటి రాఘవరెడ్డి పోటీ చేస్తారని మాగంటి శ్రీనివాసులురెడ్డి స్పష్టం చేశారు. అయితే మాగంటి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు చేసిన ప్రకటన సంచలనం రేపుతోంది. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో మాగుంట ప్రకటన చర్చనీయాంశంగా మారింది.

ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఆయన ఎప్పటినుంచో క్రియాశీలకంగా ఉన్నారు. ప్రకాశం జిల్లా పాలిటిక్ లో మాగుంట ఫ్యామిలీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఎన్నో దశబ్దాలుగా ప్రకాశం జిల్లా రాజకీయాల్లో వారి ఫ్యామిలీ చక్రం తిప్పుతోంది. అలాగే నెల్లూరు జిల్ల రాజకీయాల్లో కూడా మాగుంట ఫ్యామిలీ కీలకంగా ఉంది. తన అన్న మాగుంట సుబ్బారామిరెడ్డిని మావోయిస్టులు హత్య చేసిన తర్వాత శ్రీనివాసులురెడ్డి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తొలుత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత టీడీపీలో చాలా ఏళ్ల పాటు ఉన్నారు. టీడీపీ తరపున ఒంగోలు ఎంపీగా 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

కానీ 2019 ఎన్నికలకు ముందు మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైసీపీలో చేరారు. గత లోక్ సభ ఎన్నికల్లో వైసీపీ తరపున ఒంగోలు ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే వైసీపీలో ఆయన అసలు ఇమడలేకపోతున్నారు. ఆ పార్టీలు అసలు యాక్టివ్ గా కనిపించడం లేదు. చాలా కాలంగా వైసీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా ఆయన పెద్దగా కనిపించడం లేదు. దీంతో మాగుంట వైసీపీలో వీడతారనే ప్రచారం జరుగుతోంది.

పార్టీని పట్టించుకోకపోవడంతో వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వడం కష్టమేననే వార్తలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ఆయన పనితీరుపై జగన్ అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎంపీగానే పోటీ చేసేందుకు మాగుంట ప్రాధాన్యం ఇస్తున్నారు. కానీ వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇస్తే వైసీపీ గెలుపొందే అవకాశాలు లేవనే ప్రచారం జరుగుతోంది. జగన్ రిపోర్టుల్లో మాగుంట మీద వ్యతిరేకత ఉందని తేలిందట. పీకే టీం సర్వేల్లో కూడా ఆయనకు టికెట్ కూడా గెలుపు కష్టమేనని తెలిసిందట.

ఈ క్రమంలో వైసీపీలో టికెట్ దక్కదని కష్టమని తలుసుకున్న మాగుంట.. బీజేపీలో చేరాలని అనుకున్నారు. అయితే ఢిల్లీ లిక్కర్ స్కాం మాగుంట మెడకు చుట్టుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆయన కుమారుడికి ఈడీ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే మాగుంట శ్రీనివాసులురెడ్డికి సంబంధించి ఢిల్లీలో ఉన్న ఇళ్లు, కార్యాలయాలపై దాడులు చేపట్టింది. ఆ దాడుల్లో కీలక ఆధారాలు లభ్యమైనట్లు సమాచారం. దీంతో మీడియా సమావేశం పెట్టిన ఆయన.. రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లు తెలిపారు.

అయితే తన కుమారుడు వచ్చే ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా పోటీ చేస్తారని ఆయన ప్రకటించారు. కానీ ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనేది మాత్రం ఆయన చెుప్పలేదు. వైసీపీలో మాగుంటకే టికెట్ ఇచ్చే అవకాశం లేదనే ప్రచారం జరిగింది. అలాంటిది ఆయన కుమారుడికి జగన్ టికెట్ ఇస్తారనేది ఆశించడం కష్టమే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -