Vijay Pratap Reddy: విజయ్ ప్రతాపరెడ్డిపై మహాసేన రాజేశ్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

Vijay Pratap Reddy: ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో అలాగే యూట్యూబ్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు విజయ్ ప్రతాపరెడ్డి. ఫుడ్ కమిషనర్ అని చెప్పి అంగన్వాడీ స్కూల్స్ అలాగే నార్మల్ స్కూల్స్ తనిఖీ చేస్తూ అక్కడ విద్యార్థులకు సరైన ఫుడ్ పెట్టక వస్తువులన్నీ దోచేస్తూ ఉన్న వారికి సరైన బుద్ధి చెబుతున్నారు. ఈ మధ్యకాలంలో ప్రతాపరెడ్డికి సంబంధించిన వీడియోలు ఎక్కువగా యూట్యూబ్లో వైరల్ అవుతున్నాయి. చాలామంది అంగన్వాడీ టీచర్లను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. వారు చేసిన పనికి స్పాట్లో సస్పెండ్ చేశారు.

ఇది ఇలా ఉంటే తాజాగా విజయ ప్రతాపరెడ్డి పై మహాసేన రాజేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీడియో లోకి వెళ్తే.. ప్రతాప్ రెడ్డి నువ్వు విక్రమార్కుడు సినిమాలో లాగా రెచ్చిపోవద్దు. నీకు ప్రతాపం ఏదైనా చూపించాలి అనుకుంటే డీలర్ల మీద చూపించు వాళ్ళు ఇప్పటికే చాలా డబ్బులు దోచేసి బాగా సంపాదించుకున్నారు. వాళ్లమీద నీ ప్రతాపం చూపించు అప్పుడు నేను కూడా శభాష్ అని అంటాను.

 

అభం శుభం తెలియని ఆడపిల్లల మీద అక్క చెల్లెమ్మల మీద ఇలా విడిచిపెడుతున్నావు సస్పెండ్ చేస్తున్నావు నీకు అసలు సిగ్గుగా అనిపించడం లేదా అంటూ నోటికొచ్చిన విధంగా మాట్లాడాడు రాజేష్. ఆడపిల్లని ఒక తల్లి లాంటి అక్కలాంటి వాళ్లను ఏడిపిస్తున్నావు,అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా. అనంతరం యూట్యూబ్ లో వచ్చిన థంబ్ నెయిల్స్ గురించి స్పందిస్తూ మరింత రెచ్చిపోయి మాట్లాడాడు. మొదట నేను కూడా ఇతని కలెక్టర్ అని అనుకున్నాను. తర్వాత ఇది అతిసుత్తి క్యాండెట్ అని తెలిసింది. ఫుడ్ కమిషనర్ అని తెలిసింది ఫుడ్ కమిషనర్ కి ఐదు సంవత్సరాలు. నామినేటెడ్ పోస్టు. నువ్వు చేస్తున్న వృత్తి కరెక్టే అలా అని క్షమించి వదిలేయకుండా ఇలా చేయడం చాలా తప్పు అంటూ ప్రతాప్ రెడ్డి గురించి నోటికొచ్చిన విధంగా కామెంట్స్ చేశాడు రాజేష్. అంతేకాకుండా అద్దె సూట్ ఒకటి చేయించుకుని ఇలా యూట్యూబ్ లో వీడియోల కోసం పెద్ద పుడింగిని అంటూ చాలా ఓవర్ చేస్తున్నాడు అంటున్న నోటికి వచ్చిన విధంగా కామెంట్స్ చేశాడు. ఆ వీడియో పై స్పందించడం లేదు రాజేష్ ని తిట్టి కూర్చున్నారు. ఒక్కరింటే ఒక్కరు కూడా రాజేష్ కి అతీతంగా మద్దతుగా కామెంట్స్ చేయడం లేదు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -