Mahesh Babu: మహేష్ బాబు మెచ్చిన సినిమా.. ఆయనకు ఇష్టమైన హీరోయిన్ ఆమె!

Mahesh Babu: టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి మనందరికీ తెలిసిందే. తెలుగు సినీ ఇండస్ట్రీలో మహేష్ బాబుకి ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే. కాగా మహేష్ బాబు ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మామూలుగా అభిమానులను నీ ఫేవరెట్ హీరో ఎవరు అంటే పాలన హీరో అని చెబుతుంటారు. ఇష్టమైన సినిమా ఏది అంటే పలానా సినిమా అని చెబుతూ ఉంటారు. అదేవిధంగా హీరో మహేష్ బాబుకు కూడా హీరోయిన్ అంటే ఇష్టమట.

అలాగే ఒక సినిమా అంటే కూడా మహేష్ బాబుకు చాలా ఇష్టమట. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. తాజాగా ఈటీవీలో ప్రసారమైన ఒక ప్రోగ్రాంలో భాగంగా యాంకర్ ఝాన్సీ అడిగిన ప్రశ్నలకు మహేష్ బాబు ఈ విధంగా స్పందించారు. ఈ సందర్బంగా మహేష్ బాబు మాట్లాడుతూ..నా చిన్నప్పటి నుంచే కాదు,ఇప్పటికీ నా ఫేవెరెట్ హీరోయిన్ శ్రీదేవి మాత్రమే అని తెలిపారు మహేష్ బాబు. అనంతరం మహేష్ బాబు తన ఫేవరెట్ సినిమా గురించి మాట్లాడుతూ.. ఒక్కడు సినిమా అంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపాడు.

వీటితో పాటుగా పోకిరి దూకుడు సినిమాలు కూడా చాలా ఇష్టమని, ఎందుకంటే అవి రెండూ కూడా తనకు కొత్త స్టార్ డమ్ ను తెచ్చిపెట్టాయి అందుకే అవి రెండు సినిమాలు అన్నా కూడా తనకు ఎంతో ఇష్టం అని చెప్పుకొచ్చాడు మహేష్ బాబు. ఇకపోతే మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకులను పలకరించిన మహేష్ ప్రస్తుతం తన తదుపరి సినిమాలపై దృష్టిని పెట్టాడు. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు తనకు సమయం దొరికినప్పుడల్లా తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ లు తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -