Mahesh Babu: తండ్రి కృష్ణ అప్పులు చేస్తే కొడుకు మహేష్ బాబు ఆదుకున్నాడా.. ఇంతకీ ఏం జరిగిందంటే?

Mahesh Babu: తెలుగు సినీప్రియులకు సూపర్ స్టార్ కృష్ణ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. నటుడుగా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. చాలా సినిమాల్లో హీరోగా నటించి అగ్రస్టార్ హీరోగా అప్పటి ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగాడు. ఇక సూపర్ స్టార్ కృష్ణ వారసుడు మహేష్ బాబు కూడా ఇండస్ట్రీలో అడుగు పెట్టి నటుడుగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు.

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మహేష్ అగ్రస్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నాడు. ఇక కృష్ణ గారు ఇండస్ట్రీలో నటుడుగా హడావిడి చేస్తున్నప్పుడు పద్మాలయ బ్యానర్ పెట్టి సినిమా నిర్మాణం లోకి అడుగుపెట్టారు. ఇక ఈ విషయం గురించి సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు మాట్లాడుతూ సూపర్ స్టార్ కృష్ణ గారికి సినిమాలంటే చాలా ఇష్టమని తెలిపారు. అందుకే పద్మాలయ బ్యానర్ అప్పట్లో అప్పుల పాలు అయిందని తెలిపాడు.

పద్మాలయ బ్యానర్ లో ఎప్పుడు సినిమాల నిర్మాణం జరుగుతూనే ఉండేది. డబ్బులు సెటిల్ అయ్యాకే సినిమా విడుదల అనే మాట కృష్ణగారు ఎప్పుడు అనేవారు కాదు. దీని కారణంగా మధ్యవర్తిగా హామీ ఉండి భారీ స్థాయిలో డబ్బులను నష్టపోయారు. దానివల్ల పద్మాలయ స్టూడియో అప్పుల ఫాలో అయిందని చివరకు సీజ్ వరకు వచ్చింది. ఆ తర్వాత పద్మాలయ స్టూడియోస్ ను కృష్ణ తమ్ముడు హనుమంతరావు చూసుకునేవాడు.

ఇక అప్పుల పాలైన తర్వాత మళ్లీ ఆ స్టూడియోస్ ను నిలబెట్టింది కృష్ణ వారసుడు మహేష్ బాబు. తను సినిమాల్లోకి వచ్చాక మెల్లగా అప్పులు మొత్తం తీరిపోయాయి. ఇప్పుడు సూపర్ స్టార్ ఫ్యామిలీ మంచి పొజిషన్లో ఉన్నారు. మహేష్ బాబు అగ్ర స్టార్ హీరోగా వెలుగుతూ కుర్ర హీరోలతో సమానంగా వరుస సినిమా అవకాశాలు అందుకుంటున్నాడు. దాదాపు నాలుగు పదుల వయసు వచ్చినప్పటికీ ఇప్పటికే మహేష్ బాబు చెక్కుచెదరని అందంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. పద్మాలయ స్టూడియోస్ కు కూడా పూర్వా వైభవం కలిగింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -