Mahesh Babu: మహేష్ సినిమా కోసం ఏసీ ఫ్లోర్ లో పశువుల పాక.. మహేష్ ఇంత సున్నితమా?

Mahesh Babu: తెలుగు ప్రేక్షకులకు ప్రిన్స్ మహేష్ బాబు గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. రాజకుమారుడు సినిమా తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన మహేష్.. ఆపై పలు సినిమాల్లో స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. దాదాపు నాలుగు పదులు వయసు వచ్చినప్పటికీ ఇప్పటికీ చెక్కుచెదరని అందం మహేష్ బాబు సొంతం. ఇక మహేష్ బాబు అభిమానుల గురించి మనందరికీ తెలిసిందే.

మహేష్ కి లేడి ఫాలోయింగ్ కూడా చాలా ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం కుర్ర హీరోలతో సమానంగా మహేష్ సినిమా ఆఫర్లు అందుకుంటూ టాలీవుడ్లో అగ్రస్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నాడు. ఇటీవల సర్కారు వారి పాట సినిమాలో మహేష్ ప్రేక్షకులను ఒక రేంజ్ లో ఆకట్టుకున్నాడు. ఇక మహేష్ చూడడానికి ఎంత సున్నితంగా కనపడతాడో తను కూడా అంత రిస్క్ చేయలేడు. తను ఎక్కువగా ఎండలో షూటింగ్ చేయడానికి ఇష్టపడడట.

తను ఒక పది నిమిషాలు ఎండలో ఉంటే చాలా కందిపోతాడట. ఎందుకంటే మహేష్ చర్మం సున్నితంగా ఉంటుంది. ఇక మహేష్ యవ్వనానికి అనేక రకాలుగా హోమ్ రెమెడీస్ చేస్తూ ఆరోగ్యమైన ఫుడ్ ను తీసుకుంటాడు. దీని కారణంగా మహేష్ బాబు ఎండలో అంతగా నిలబడడానికి ఇష్టపడదట. ఈ నేపథ్యంలో మహేష్ బాబు యాక్షన్ సీన్స్ చేయాలంటే కొంచెం ఆలోచించాల్సిందే.

ఎందుకంటే మహేష్ బాబు రఫ్ అండ్ వ్యవహారం కాదు. దేనినైనా సున్నితంగా చేయాలనుకుంటాడు. మహేష్ ఎండలో షూటింగ్ నేపథ్యంలో పాల్గొనలేక అప్పటికప్పుడు ఏసీ ఫ్లోర్ లో పశువులపాక వేయించిన రోజు కూడా ఉందట. ఈ విషయం తెలిసిన మహేష్ బాబు అభిమానులు మహేష్ మరీ ఇంత సున్నితమా? అని ఆశ్చర్యపోతున్నారట. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో వచ్చే సినిమా షూటింగ్ నేపద్యంలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో భారీ యాక్షన్లు కూడా ఉంటాయట. మరి ఈ సినిమా షూటింగ్ ను మహేష్ ఏ విధంగా ఎదుర్కొంటాడో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -