Mahesh Mother Passes Away: ఇండస్ట్రీలో విషాదం.. మహేష్ బాబుకు మాతృవియోగం?

Mahesh Mother Passes Away: టాలీవుడ్ ప్రేక్షకులకు అగ్రస్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తెలుగు ఇండస్ట్రీలో చాలా సినిమాల్లో నటించి నటుడుగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక మహేష్ బాబు అభిమానుల గురించి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం కుర్ర హీరోలతో సమానంగా వరుస సినీ ఆఫర్లను తన సొంతం చేసుకుంటున్నాడు.

దాదాపు నాలుగు పదులు వయసు వచ్చినప్పటికీ ఇప్పటికీ చెక్కుచెదరని అందం మహేష్ బాబు సొంతం. మహేష్ బాబు సోషల్ మీడియాలో కూడా యమా యాక్టివ్ గా ఉంటాడు. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్ డేట్స్ సోషల్ మీడియాలో పంచుకుంటాడు. ప్రస్తుతం వరుస ఆఫర్లతో కెరీర్ పరంగా ఒక రేంజ్ లో దూసుకుపోతున్నాడు మహేష్. ఇటీవలే విడుదలైన సర్కారు వారి పాట సినిమా మనందరికీ తెలిసిందే.

ఈ సినిమా ప్రేక్షకులను మరో స్థాయిలో ఆకట్టుకుంది. కుర్ర హీరోలు జలసిగా ఫీల్ అయ్యేలా మహేష్ ఈ సినిమాలో బాగా కనిపించాడు. ఇదంతా పక్కన పెడితే మహేష్ బాబు ఇంట్లో ఈరోజు విషాదం నెలకొంది. ఆమె తల్లి ఇందిరా దేవి కాసేపటికి క్రితం ఇంట్లోనే మరణించింది. సూపర్ స్టార్ కృష్ణకు ఇందిరా దేవి మొదటి భార్య. కాగా వీరికి మహేష్, రమేష్, మంజులలు జన్మించారు. ఇక సూపర్ స్టార్ కృష్ణ గారి రెండో భార్య విజయనిర్మల ఈమె 2019లో చనిపోయిన సంగతి మన అందరికి తెలిసిందే.

ఏదేమైనా అగ్రస్టార్ హీరో మహేష్ బాబు తన తల్లిని కోల్పోవడం సినీ ఇండస్ట్రీకి చాలా బాధ కలిగిస్తుంది. మహేష్ తల్లి చనిపోయి ఇప్పటికీ కొన్ని నిమిషాలు అవుతుంది. ప్రస్తుతం మహేష్ తల్లి మరణ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఇక మహేష్ బాబు తల్లి మరణ వార్త తెలిసి మహేష్ అభిమానులు చాలా బాధపడుతున్నారు. ఇక ప్రస్తుతం సినీ రాజకీయ వర్గాలు మహేష్ బాబు కుటుంబాన్ని పరామర్శించడానికి మహేష్ ఇంటికి బయలుదేరినట్లు తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణాలివే.. ఆ తప్పులే ముంచేశాయా?

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఈ పార్టీకి 2023 ఫలితాలు మాత్రం...
- Advertisement -
- Advertisement -