Mahesh: మహేష్ బాబు బెస్ట్ ఫ్రెండ్ ఆమెనా?

Mahesh: టాలీవుడ్ లో మహేష్ బాబు గురించి కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. ఎందుకంటే మహేష్ బాబు ఇండస్ట్రీలో ఆ రేంజ్ లో వెలుగుతున్నాడు. ప్రస్తుతం ఐదు పదుల వయసు వచ్చినప్పటికీ.. మహేష్ యంగ్ హీరో లుక్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. నటనలో తండ్రికి తగ్గ కొడుకుగా పేరు సంపాదించుకొని ఇండస్ట్రీలో అగ్ర స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇక మహేష్ బాబు అభిమానుల గురించి మనందరికీ తెలిసిందే. కుర్ర హీరోలతో సమానంగా ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మహేష్ తెగ హడావిడి చేస్తున్నాడు. ఆ మధ్య సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్. ఆ సినిమాతో వేరే స్థాయిలో సక్సెస్ ను అందుకున్నాడు. ఈ సినిమా మహేష్ బాబు అభిమానులు వేసుకున్న అంచనాలకు తాకింది. అంతేకాకుండా మహేష్ అభిమానులకు ఈ సినిమా ఒక గొప్ప గిఫ్ట్ అని చెప్పవచ్చు.

ఆ సినిమాలో కీర్తి సురేష్ సరసన హీరోగా ఒక రేంజ్ లో మెప్పించాడు. ఇక స్క్రీన్ పై వీళ్ళిద్దరి రొమాన్స్ కు వేరే స్థాయిలో ఆదరణ దక్కింది. ఇదిలా ఉంటే తాజాగా మహేష్ తన బెస్ట్ ఫ్రెండ్ ఎవరో అన్న విషయాన్ని బయట పెట్టాడు. డాన్స్ ఇండియా షోకి మహేష్ బాబు తన కూతురు సితార గెస్ట్ లుగా హాజరయ్యారు. ఆ షో లో మహేష్ బాబుకి నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు.. అనే ప్రశ్న ఎదురవుతుంది.

దానికి మహేష్ బాబు నా బెస్ట్ ఫ్రెండ్ మై వైఫ్ అని చెప్పాడు. దాంతో షోలో ప్రతి ఒక్కరు ఆ మాట విని ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. ప్రస్తుతం ఈ షో కి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తుంది. మీరు కూడా ఆ వీడియోను ఒకసారి చూసేయండి. మరి మహేష్ బాబు తన బెస్ట్ ఫ్రెండ్ గా తన భార్యని ఎందుకు చూస్ చేసుకున్నాడో.. తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -