Mahesh: త్రివిక్రమ్ ను తొందరగా వదిలించుకునే ప్రయత్నంలో మహేష్ బాబు!

Mahesh: టాలీవుడ్ ప్రేక్షకులకు హీరో మహేష్ బాబు గురించి పెద్దగా పరిచయంకర్లేదు. రాజకుమారుడు సినిమా ద్వారా హీరోగా పరిచయమైన మహేష్.. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. ఇక మహేష్ బాబు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మనందరికీ తెలిసిందే. దాదాపు ఐదు పదులు వయసు వచ్చినప్పటికీ.. ఇప్పటికీ చెక్కుచెదరని అందం మహేష్ బాబు సొంతం.

కుర్ర హీరోలతో సమానంగా మహేష్ బాబు సినిమా ఆఫర్లు తగ్గించుకుంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడుగా ఓ వెలుగు వెలుగుతున్నాడు. ఇదిలా ఉంటే గత కొంతకాలంగా మహేష్ బాబు నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ అందించలేకపోయాయి. దీని కారణంగా మహేష్ అభిమానులు చాలా నిరాశపడుతున్నారు.

కాబట్టి మహేష్ బాబు తాను తర్వాత తీసే సినిమాలతో ఎలాగైనా బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ ను సాధించాలని పోటీ పడుతున్నట్లు తెలుస్తుంది. మొదట మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమాతో బాగా నమ్మకాలు పెట్టుకున్నాడు. ఇక ఆ కథ విషయంలో కూడా మహేష్ కి ఎప్పుడూ లేనన్ని డౌట్లు వచ్చాయి. అందుకే త్రివిక్రమ్ సినిమా సిద్ధం చేయడానికి కూడా చాలా సమయం పట్టింది.

దీంతో ఇప్పటికీ ఆయనకు ఆ సినిమాపై అనుమానాలు ఉండటంతో త్రివిక్రమ్ సినిమాను త్వరగా పూర్తి చేసి వదిలించుకోవాలని అనుకున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబుకి రాజమౌళి సినిమాతో బాగా నమ్మకాలు పెట్టుకున్నాడు. అయితే రాజమౌళి సినిమాతో మహేష్ సక్సెస్ అయితే తప్పకుండా సాధిస్తాడు. అలా సాధించాలి అంటే.. దానికి తగ్గట్టుగా కష్టపడాలి కూడా. రెండు మూడేళ్లు వృధా అయినా పర్వాలేదు.

సినిమాను ఎలాగైనా బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ సాధించాలని మహేష్ బాబు అనుకుంటున్నాడట. అందుకే మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమాలో చేసే కష్టమైన షెడ్యూల్ ను ముందుగా పూర్తిచేసి తర్వాత చిన్నచిన్న షూట్లను చేయించుకోవాలని ఫిక్స్ అయ్యాడట. ఈ విధంగా మహేష్ త్రివిక్రమ్ సినిమా ను త్వరగా పూర్తిచేసుకుని రాజమౌళి సినిమాకు సిద్ధమవుతున్నాడట. ముందు మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమాను షూటింగ్ పని విషయంలో పూర్తి చేసే ప్లాన్ లో ఉన్నాడట.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -