Mahesh Babu: మహేష్ బాబుది నిజమైన హెయిర్ కాదా.. ఆయన జుట్టు వెనక అంత సీక్రెట్ ఉందా?

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఎంతోమంది అభిమానులు ఉన్నారని చెప్పాలి.ముఖ్యంగా ఈ హీరోకి అబ్బాయిల కన్నా అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది. మహేష్ బాబు ఎంతో క్యూట్ గా ఉండడమే కాకుండా ఈయన స్మైల్ కు ఎంతో మంది అమ్మాయిలు ఫిదా అవుతుంటారు. ప్రస్తుతం మహేష్ బాబు నాలుగు పదుల వయసులో ఉన్నప్పటికీ ఈయన యంగ్ హీరోగా ఎంతో చలాకీగా ఉంటారు.ఇలా ఎంతో అందంగా స్టైలిష్ గా ఉన్నటువంటి మహేష్ బాబు అందానికి ఆయన జుట్టు కూడా కారణమని చెప్పాలి.

ఇకపోతే ఇండస్ట్రీలో ఉన్న హీరోలు ఎక్కువగా విగ్గులు వాడుతుండడం మనం చూస్తున్నాము. అయితే మహేష్ బాబు విషయంలో ప్రతిసారి తన హెయిర్ స్టైల్ గురించి ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి మహేష్ బాబుకి అది రియల్ హెయిర్ కాదని అది విగ్ అంటూ కొంతమంది పెద్ద ఎత్తున ఆయన హెయిర్ స్టైల్ పై సందేహాలను వ్యక్తపరిచారు. అయితే మహేష్ బాబుది నిజమైన హెయిరా లేకపోతే విగ్గా అనే విషయానికి వస్తే..

టాలీవుడ్ సమాచారం ప్రకారం మహేష్ బాబుది రియల్ హెయిర్ కాదని తెలుస్తోంది. ఈయన క్యూ6 హెయిర్ ప్యాచ్ టెక్నాలజీ వంటి హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ టెక్నాలజీ ద్వారా మహేష్ బాబు జుట్టును అమర్చారని తెలుస్తోంది ఇది చూడటానికి రియల్ హెయిర్ లాగే ఉన్నప్పటికీ ఇది నిజమైన జుట్టు కాదని చెప్పాలి. ఇకపోతే మహేష్ బాబు నాని సినిమా నుంచి ఇలాంటి హెయిర్ ప్యాచ్ టెక్నాలజీ ద్వారా ఒక్కో సినిమాకు ఒక్కో విధమైన హెయిర్ స్టైల్ ఉపయోగిస్తున్నారు.

ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సల్మాన్ ఖాన్,అమీర్ ఖాన్ వంటి హీరోలు ఈ హెయిర్ ప్యాచ్ టెక్నాలజీ ద్వారా హెయిర్ స్టైల్ చేయించుకుంటారని మహేష్ బాబు కూడా అదే టెక్నాలజీతో విభిన్న హెయిర్ స్టైల్స్ చేయించుకుంటున్నారని చెప్పాలి. ఇక మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈయన సర్కారు వారి పాట సినిమాతో మంచి హిట్ అందుకోగా తన తదుపరి సినిమాని త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -