Mahesh Babu: బీస్ట్ లుక్కులో మహేష్ బాబు.. స్విమ్మింగ్ పుల్ లో బాడీ చూపిస్తూ!

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే అగ్ర హీరోగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇక ఈ స్టార్ హీరోకి ఇండస్ట్రీలో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఈయనకు అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఉంది. మహేష్ బాబు హ్యాండ్సమ్ హీరో మాత్రమే కాకుండా తన స్మైల్ తో ఎంతోమందికి అభిమాన హీరోగా మారిపోయారు.

ఈ క్రమంలోనే ఈయనకు సంబంధించిన ఏ చిన్న ఫోటో వచ్చిన పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఇకపోతే ఇప్పటికే ఎంతోమంది హీరోలు వారి సినిమాలలో సిక్స్ ప్యాక్ బాడీ చూపిస్తూ సినిమాలలో నటించారు. కానీ ఇప్పటివరకు మహేష్ బాబు ఎక్కడ షర్టు లేకుండా సినిమాలలో కానీ బయట కాని కనిపించింది లేదు. అయితే తాజాగా మహేష్ బాబుకు సంబంధించిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ ఫోటోలో మహేష్ బాబు స్విమ్మింగ్ పూల్ లో మొదటిసారి షర్ట్ లేకుండా కెమెరా కంటికి చిక్కారు. ఇలా లైట్ బియర్డ్ లుక్ లో కళ్ళజోడు పెట్టుకుని షర్టు లేకుండా మహేష్ బాబు స్విమ్మింగ్ పూల్ లో ఉన్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో మహేష్ అభిమానులు ఈ ఫోటోను చూసి ఎంతో సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా ఈ ఫోటోని పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు. మొదటిసారిగా మహేష్ బాబు షర్ట్ లేకుండా కనిపించి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.

ఇకపోతే మహేష్ బాబు ఈ లుక్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించినదా లేకపోతే త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో భాగంగా ఇలాంటి లుక్ లో కనిపించనున్నారా అనే విషయం తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా మహేష్ బాబు ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఈ ఫోటో చూసిన మహేష్ అభిమానులు మొదటిసారిగా మహేష్ బాబు షర్ట్ లేకుండా తన బాడీని చూస్తున్నాం అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -