Mahesh: బిజినెస్ మేన్ తో సంచలన రికార్డ్ సృష్టించిన మహేష్.. నైజాం నవాబ్ అనేలా?

Mahesh: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా స్టార్ హీరోల పుట్టినరోజు సందర్భంగా ఆయా హీరోల కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచిన సినిమాలను మరొకసారి థియేటర్ లలో రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఈ ట్రెండ్ బాగా ఎక్కువ అయ్యింది. కాగా ఇప్పటికే, ఆరెంజ్, జల్సా, ఖుషి, ఒక్కడు, మురారి, ఆది, త్రీ, బిల్లా, సింహాద్రి లాంటి సినిమాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా మహేష్ బాబు పుట్టినరోజు సందర్బంగా బిజినెస్ మేన్ మూవీని రీ రిలీజ్ చేశారు.

ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో భారీ ఆదరణను దక్కించుకుంది. నైజాంలో ఏకంగా రూ. 2.5 కోట్ల గ్రాస్ వసూళ్లతో ఆల్ టైం రికార్డు సాధించింది. చాలా ప్రాంతాలలో బిజినెస్ మేన్ గత చిత్రాల రికార్డ్స్ చెరిపివేసింది. మొత్తంగా వరల్డ్ వైడ్ రూ. 5.31 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. నైజాం ఏరియాలో మహేష్ కి తిరుగులేదని మరొకసారి రుజువయ్యింది. 2012లో సంక్రాంతి కానుకగా విడుదలైన బిజినెస్ మేన్ సూపర్ హిట్ అందుకుంది. దర్శకుడు పూరి జగన్నాథ్ మహేష్ కాంబోలో వచ్చిన రెండో చిత్రం బిజినెస్ మేన్.

 

పోకిరితో ఇండస్ట్రీ రికార్డ్స్ బద్దలు కొట్టిన కాంబో కావడంతో భారీ హైప్ ఏర్పడింది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ప్రకాష్ రాజ్, నాజర్ కీలక రోల్స్ చేశారు. ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే.. నైజాం – 2.5 కోట్లు, సీడెడ్ – 35.6 లక్షలు, తూర్పు – 34.2 లక్షలు, ఉత్తరాంద్ర – 42.1 లక్షలు, కృష్ణ – 26.5లీ, గుంటూరు – 31.4 లక్షలు, నెల్లూరు – 7.13, లక్షలు, వెస్ట్ – 15.28 లక్షల కలెక్షన్స్ ను రాబట్టింది. ఏపీ/తెలంగాణ లో కలిపి 4.42 కోట్లు రాబట్టింది.
వరల్డ్ వైడ్ గ్రాస్ : 5.31 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టింది ఈ మూవీ.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -