MaheshBabu: కూతురి వయస్సు ఉన్న హీరోయిన్ తో మహేష్ రొమాన్స్ చేస్తారా?

MaheshBabu: టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా, వయసు పెరిగిన కొద్దీ యంగ్ గా తయారవుతున్న హీరో మహేష్ బాబు. చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీరంగ ప్రవేశం చేసిన మహేష్ బాబు.. మంచి సినిమాలు చేస్తూ అభిమానుల్లో తనకంటూ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు. ‘సర్కారు వారి పాట’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అందుకున్న మహేష్.. త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నాడు.

మహేష్ బాబు కుటుంబ సభ్యులు వరుస మరణాల నేపథ్యంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేస్తున్న సినిమా వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది. మహేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి చేస్తున్న సినిమాలో బాలయ్య కూతురు నటిస్తోందని సమాచారం.

అయితే నందమూరి బాలయ్య రియల్ లైఫ్ కూతురు కాదు. బాలయ్య తర్వాతి సినిమాలో కూతురిగా చేస్తున్న హీరోయిన్ తో మహేష్ బాబు జోడి కట్టబోతున్నాడు. నందమూరి బాలయ్య, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో కలిసి ఓ మాస్ సినిమా చేస్తుండగా.. ఈ సినిమాలో బాలయ్య కూతురిగా శ్రీలీల కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.

అదే సమయంలో మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి చేస్తున్న సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా చేస్తోంది. అంటే బాలయ్య సినిమాలో కూతురి క్యారెక్టర్ వేసిన శ్రీలీల.. మహేష్ పక్కన హీరోయిన్ గా రొమాన్స్ చేయనుందనే వార్త ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.

Related Articles

ట్రేండింగ్

ఏపీలో ఆడుదాం ఆంధ్ర పోటీలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ఎప్పటికప్పుడు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ విద్యార్థులు, యువతకు మేలు చేస్తున్న సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడా పోటీలను నిర్వహిస్తుండగా...
- Advertisement -
- Advertisement -