Uttar Pradesh: భార్య బరువు పెరుగుతుందని కోర్టులో పిటీషన్‌!

Uttar Pradesh: ప్రస్తుతం భార్యభర్తల్లో వస్తున్న చిన్న చిన్న మార్పులతో కుటుంబ బంధాలను తెంచుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ తనకు కాబోయే భార్య, భర్త ఇలాగుంటే బాగుంటుందని కోరుకుంటారు. కానీ.. అందరికీ ఇది సాధ్యమవ్వదు. కొందరికి వారు అనుకున్నట్లు అవుతోంది.. మరికొందరికి కావు. పెళ్లైన తర్వాత ఇద్దరిలో ఏ ఒక్కరిలో మార్పులు వస్తే కొందరు గొడవకు దిగుతారు. మరి కొందరు సర్దుకుపోతారు. అయితే.. వీటికి భిన్నంగా ఓ ప్రబుద్ధుడు అనాలోచిత నిర్ణయం తీసుకున్నాడు. పెళ్లి అయిన తర్వాత తన భార్య లావు అయిందని విడాకులు కోరాడు.

ఉత్తరప్రదేశ్‌ మీరట్‌లోని జాకిర్‌ కాలనీకి చెందిన నజ్మా–సల్మాన్‌ భార్యా భర్తలు. వీరికి ఎనిమిది ఏళ్ల క్రితం వివాహమైంది. ప్రస్తుతం వారికి ఏడు సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. పెళ్లి తర్వాత నజ్మా బరువు పెరుగుతూ వచ్చింది. ఆమె బరువు పెరగడం సల్మాన్‌కు నచ్చడం లేదు. బరువు పెరుగుతున్న కారణంతో రోజూ సల్మాన్‌ భార్యతో గొడవకు దిగుతున్నాడు. ఇంత లావుగా ఎవరూ ఉండరంటూ ఆమెను మానసికంగా హింసించడం మొదలు పెట్టాడు. అంతటి ఊరుకోకుండా తనను ఇంట్లో నుంచి బయటకు గెంటేశాడని నజ్మా ఆవేదన వ్యక్తం చేసింది.

నేను పెరుగుతున్నానని నాతో ఉండటం ఇష్టం లేదని విడాకులు కావాలని కోర్టులో పిటీషన్‌ వేశాడు సల్మాన్‌. ఆమెకు కోర్టు నుంచి నోటీసులు రావడంతో తనకు సల్మాన్‌ తోనే జీవించాలని ఉందని నాకు విడాకులు అక్కర్లేదని కోరుతూ నజ్మా పోలీస్‌ స్టేషన్‌ ను ఆశ్రయించింది. కానీ.. పోలీసులు మాత్రం ఈ విషయంలో తమకు ఎలాంటి సమాచారం లేదని చెప్పడం విడ్డూరం. తమ దృష్టికి వస్తే విచారిస్తామని స్థానిక సీఐ అరవింద్‌ చౌరాసియా మీడియాకు తెలిపారు. లావు పెరిగితే విడాకులు కోరడం ఏంటని స్థానిక మహిళ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -