Manas-Vishnu Priya: రొమాంటిక్ డ్యాన్స్ లో రెచ్చిపోయిన మానస్, విష్ణుప్రియ.. అలా చేస్తూ?

Manas-Vishnu Priya: బుల్లితెరపై టీవీ షోలు విపరీతంగా జనాలను ఆకట్టుకుంటున్నాయి. ప్రతి పండక్కీ కొత్త సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో బుల్లితెరపై కూడా కొన్ని షోలు దర్శనమిస్తున్నాయి. అటు డ్రామాను, ఇటు రొమాన్స్ ను చూపిస్తూ బుల్లితెర షోలు పాపులర్ అవుతున్నాయి. ఈటీవీలో కూడా ప్రతి పండక్కి కచ్చితంగా ఓ ఈవెంట్ జరగడం విశేషం. న్యూయర్ సందర్భంగా కూడా ఓ సరికొత్త షో చేసి ఈటీవీ అందర్నీ అలరించింది. ఇప్పుడు సంక్రాంతికి ‘మంచి రోజులొచ్చాయి’ అనే పేరుతో ఓ ప్రోగ్రాంని చేస్తోంది.

 

తాజాగా ఆ ప్రోగ్రామ్ కు సంబంధించి ఓ ప్రోమో విడుదలైంది. అందులో విష్ణుప్రియ అదిరిపోయే పెర్ఫామెన్స్ ఇచ్చింది. షార్ట్ ఫిల్మ్ యాక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన విష్ణుప్రియ ఆ తర్వాత కమెడియన్ సుడిగాలి సుధీర్ తో కలిసి ‘పోరాపోవే’ షో చేసి పాపులర్ అయ్యింది. ఆ తర్వాత ఎన్నో షోలు చేసి రెండు చేతులా సంపాదించింది. ఆ మధ్యన ‘పండుగాడ్’ అనే సినిమాలో ఓ హీరోయిన్ గా చేసి తన నటనతొో మెప్పించింది. అయితే ఆ సినిమా ఆమె కెరీర్ కేమీ ప్లస్ కాలేదు. దీంతో మళ్లీ ఆమె షోలు, ఆల్బమ్ సాంగ్స్ చేస్తూ బిజీ బిజీగా ఉంటోంది.

 

తాజాగా ఆమె ‘జరీ జరీ పంచె కట్టి’ అని ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ ను చేసింది. బిగ్ బాస్ కంటెస్టెంట్ మానస్ తో కలిసి విష్ణుప్రియ ఈ సాంగ్ లో ఇరగదీసింది. సోషల్ మీడియాలో ఆ సాంగ్ సూపర్ హిట్ అయ్యిందని చెప్పొచ్చు. దీంతో విష్ణుప్రియ-మానస్ నే ఈసారి మెయిన్ గా పెట్టి సంక్రాంతి షోను ప్లాన్ చేయడం విశేషం. అందులో భాగంగానే వీరిద్దరికీ పెళ్లి చేయాలని అనుకున్నారు.

 

ఈ షోలో మొదట విష్ణుప్రియ తరపు బంధువులు, మానస్ తరపు బంధువులు వచ్చి ఆ తర్వాత పెళ్లి తంతును జరిపిస్తారు. పెళ్లి కోసం వారు వీరు చాలా హంగామా చేస్తారు. విష్ణుప్రియ-మానస్ ఈ షోలో ‘ఈ వర్షం సాక్షిగా’ అనే సాంగ్ కి అద్భుతమైన కెమిస్ట్రీతో ఫెర్ఫార్మ్ చేశారని, వీరద్దరూ ఇందులో కలిసి జీవించేశారని టాక్ వినిపిస్తోంది. రెయిన్ ఎఫెక్ట్, విష్ణుప్రియ రొమాంటిక్ డ్యాన్స్ చూసిన నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -