Manchu Lakshmi: పిల్లల తల్లైన మంచు లక్ష్మికి అలాంటి పాత్రలు అవసరమా?

Manchu Lakshmi: మన టాలీవుడ్ లో పెద్ద ఫ్యామిలీలు కొన్ని ఉన్నాయి. అందులో మంచు కుటుంబం ఒకటి. మోహన్ బాబు తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకోవడంతో పాటు తన వారసులను కూడా ఇండస్ట్రీ కి పరిచయం చేశారు. అలా అడుగుపెట్టిన వారే మంచు విష్ణు, మంచు మనోజ్, మంచు లక్ష్మీ. మంచు లక్ష్మీ ప్రసన్న ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించారు తన కెరీర్ లో.

అలాంటి పాత్రలో మంచు లక్ష్మీ!

ఫాంటసీ అడ్వెంచర్ చిత్రం అనగనగా ఓ ధీరుడు తో తన నటన ఏపాటిదో ఇండస్ట్రీ కి పరిచయం చేసింది ఈ మంచు వారమ్మయి. ఆ చిత్రం పెద్దగా ఆడకపోయినా మంచి అవకాశాలు లక్ష్మీ ని వెతుక్కుంటూ వచ్చాయి. అలాంటి ఒక ప్రత్యేకమైన పాత్రలో ఇంకొకసారి మెరవబోతోంది లక్ష్మీ.

విభిన్నమైన పాత్రలకి కేరాఫ్ అడ్రస్ మంచు లక్ష్మీ ఒక హోమో సెక్సువల్ పాత్రలో నటించారు. అయితే ఈ పాత్ర మీద కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి నెటిజన్ల నుంచి.ఇంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చి ఇలాంటి పాత్రలు ఏంటి అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఇవి అవసరమా అన్న వాళ్ళు కూడా లేకపోలేదు.

ఒకవేళ ఇది డైరెక్ట్ తెలుగు సినిమా అయితే పరిస్థితి వేరేలా ఉండేదేమో. కానీ ఇది ఒక మలయాళ చిత్రం.అయితే ఈ చిత్రం తెలుగులో అనువాదం అవుతుందా లేదా అనేది వేచి చూడాలి. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం మంచు లక్ష్మీ ప్రసన్నకి ఇంకో మహిళతో ఇంటిమేట్ సన్నివేశాలు ఉన్నాయని చెపుతున్నారు. చూడాలి మరి అసలు ఆ చిత్రంలో అలాంటి సన్నివేశాలు ఉన్నాయో లేదో. అసలు ఇలాంటి పాత్ర ఎన్నుకోవడమే ఒక డేరింగ్ డెసిషన్. సాధారణంగా నటీమణులు ఇలాంటి.పాత్రలు చేయడానికి కొద్దిగా జంకుతారు.

Related Articles

ట్రేండింగ్

Raghurama Krishnam Raju: రఘురామ కృష్ణంరాజు కల నెరవేరిందిగా.. ఉండి ఎమ్మెల్యేగా ఆయన విజయం పక్కా!

Raghurama Krishnam Raju: ప్రస్తుత నరసాపురం సిట్టింగ్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి నర్సాపురం ఎంపీగా గెలుపొందారు. ఇలా గెలిచిన కొద్ది రోజులకే పార్టీ పిఠాయించి తెలుగుదేశం చెంతకు చేరారు....
- Advertisement -
- Advertisement -