Manchu Lakshmi: ఎవడి దూ* వాడిది.. మనోజ్ రెండో పెళ్లిపై మంచు లక్ష్మి కామెంట్స్?

Manchu Lakshmi: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కుటుంబంలో మంచు కుటుంబం ఒకటి.మంచు ఫ్యామిలీ నుంచి విష్ణు మనోజ్ లక్ష్మీప్రసన్న ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అయితే వీరికి ఇండస్ట్రీలో పెద్దగా గుర్తింపు రాలేదని చెప్పాలి.ఇకపోతే హీరోగా మంచు మనోజ్ పలు సినిమాలలో నటించారు. ప్రస్తుతం ఈయన పూర్తిగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు.

ఇదిలా ఉండగా గత కొద్ది రోజులుగా మంచు మనోజ్ రెండో పెళ్లికి సంబంధించిన వార్తలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈయన భూమా మౌనికను రెండవ వివాహం చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. ఇదే విషయమే మనోజ్ ను ప్రశ్నించగా సరైన సమయం చూసి చెబుతానని చెప్పారే తప్ప ఈ వార్తలను ఖండించలేదు.ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు లక్ష్మి మనోజ్ రెండో పెళ్లి వార్తల గురించి స్పందించారు.

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై మీ అభిప్రాయం ఏంటి అంటూ యాంకర్ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు లక్ష్మీ సమాధానం చెబుతూ ఎవడి దూ* వాడిది.. వాడు పెళ్లి చేసుకుంటే నన్నేం చేయమంటారు అంటూ సమాధానం చెప్పారు.ప్రస్తుత కాలంలో స్వచ్ఛమైన ప్రేమ దొరకడం చాలా కష్టంగా ఉంది అయితే మనోజ్ కు అలాంటి ప్రేమ దొరకడం చాలా ఆనందంగా ఉంది తనని నేను బ్లెస్ చేస్తున్నాను అంటూ ఈమె చెప్పారు.

ఈ విధంగా మనోజ్ పెళ్లి గురించి లక్ష్మీ ప్రసన్న చేసిన ఈ వ్యాఖ్యలు చూస్తుంటే త్వరలోనే మంచు కాంపౌండ్ లో పెళ్లి బాజాలు మోగనున్నాయని తెలుస్తోంది.త్వరలోనే మంచు మనోజ్ భూమ మౌనిక రెండో పెళ్లి గురించి మంచి ఫ్యామిలీ అధికారకంగా ప్రకటించబోతున్నారని లక్ష్మీ ప్రసన్న మాటల ద్వారా అర్థమవుతుంది. మరి ఈ విషయాన్ని ఎప్పుడు అధికారికంగా వెల్లడిస్తారో వేచి చూడాలి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan , YS Sharmila: పసుపు రంగును జగన్ సహించలేకపోతున్నారా.. నీచమైన కామెంట్ల వెనుక కారణాలివేనా?

CM Jagan , YS Sharmila: వైయస్ జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి అంటే ఆయన మాట తీరు ఆయన వ్యవహార శైలి ఎలా...
- Advertisement -
- Advertisement -