Manchu Mohan Babu: టీడీపీలో చేరనున్న మోహన్ బాబు? వచ్చే ఎన్నికల్లో అక్కడడ నుంచి పోటీ?

Manchu Mohan Babu: ఏపీ సీఎం వైఎస్ జగన్ కు బంధువైన మంచు మోహన్ బాబు టీడీపీలో చేరేందుకు సిద్దమైనట్లు ప్రచారం సాగుతోంది. టీడీపీలో చేరడమే కాకుండా వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ తరపున పోటీ కూడా చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఆయన కుమారుడు మంచు మనోజ్ కు కూడా టీడీపీ నుంచి టికెట్ ఇచ్చేందుకు మంచు మోహన్ బాబు ప్రయత్నాలు చేస్తోన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీకి అండగా మోహన్ బాబు ఉన్నారు. వైసీపీ తరపున గత ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు.

చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు మోహన్ బాబు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మోహన్ బాబుకు ఏదైనా పదవి ఇస్తారని ఆశించారు. కానీ మోహన్ బాబుకు ఎలాంటి నామినేటెడ్ పదవి దక్కలేదు. టీటీడీ చైర్మన్ పదవిని మోహన్ బాబు ఆశించారు. కానీ తన బంధువు వైవీ సుబ్బారెడ్డికి టీటీడీ ఛైర్మన్ పదవిని జగన్ అప్పగించారు. గతంలో టీడీపీ తరపున రాజ్యసభ ఎంపీగా మోహన్ బాబు పనిచేశారు. దీంతో రాజ్యసభ పదవి వస్తుందేమోనని మోహన్ బాబు ఆశించినా భంగపాటు తప్పలేదు. అలాగే తమ కాలేజీలకు ఫీజు రీయింబర్స్ మెంట్ లాంటివి విడుదల చేయకపోవడంతో జగన్ పై తీవ్ర అసంతృప్తితో మోహన్ బాబు ఉన్నారు.

వైసీపీకి గత కొంతకాలంగా దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలో గత రెండు నెలల క్రితం హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన మోహన్ బాబు.. ఆయనను కలిశారు. మోహన్ బాబు వెంట కూతురు మంచు లక్ష్మీ కూడా ఉంది. దీంతో మంచు మోహన్ బాబు టీడీపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. చంద్రబాబును విమర్శించి మోహన్ బాబు.. అనూహ్యంగా చంద్రబాబును కలవడం చర్చనీయాంశంగా మారింది. వైసీపీలో అసంతృప్తిగా ఉన్న ఆయన.. రాజకీయాల గురించి మాట్లాడటానికే చంద్రబాబును కలిసినట్లు అర్ధమవుతుంది.

ఈ క్రమంలో ఓ వార్త సంచలనంగా మారింది. మంచు మోహన్ బాబు త్వరలోనే టీడీపీలో చేరతారని తెలుస్తోంది. చిత్తూరు నుంచి ఆయన ఎంపీగా పోటీ చేస్తారని సమాచారం. త్వరలోనే మంచు మోహన్ బాబు పసుపు కండువా కప్పుకోనున్నారని తెలుస్తోంది. అలగే ఇటీవల మంచు మనోజ్ కూడా త్వరలో రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. దీంతో మంచు మనోజ్ కూడా టీడీపీలో చేరతారని ప్రచారం సాగుతోంది. మంచు మనోజ్ కూడా చిత్తూరు జిల్లాలోని ఓ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేయనున్నారని వార్తలు వినిపిస్తుననాయి.

Related Articles

ట్రేండింగ్

AP Recruitments: ఎలాంటి రాతపరీక్ష లేకుండా రూ.50,000 వేతనంతో జాబ్.. ఎలా దరఖాస్తు చేయాలంటే?

AP Recruitments:  నిరుద్యోగులకు శుభవార్త, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఏపీ ప్రభుత్వం జాబ్ నోటిఫికేషన్ ని తీసుకువచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్య వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ జిల్లా...
- Advertisement -
- Advertisement -