Marasinganahalli: ఒంటరి మహిళపై అత్యాచారం చేసి.. కాల్చి చంపిన దుండగులు?

Marasinganahalli: రాను రాను సమాజంలో ఆడవారికి రక్షణ కరువవుతోంది. కామాందుల దానికి ఆడవారు బలవుతూనే ఉన్నారు. వ్యాప్తంగా నిత్యం పదుల సంఖ్యలో ఆడవారిపై అత్యాచారాలు జరుగుతుండగా హత్యలు కూడా అదే రేంజ్ లోనే జరుగుతున్నాయి. ప్రభుత్వం కఠిన నిబంధనలు తీసుకురాకపోవడంతో కామాంధుల ఆగడాలుకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఒంటరిగా ఉన్న మహిళలను, రోడ్డుపై వెళ్తున్న మహిళలను ఇలా ఎక్కడపడితే అక్కడ ఆడవారు కనిపిస్తే చాలు మృగాలు రెచ్చిపోతున్నారు. తాజాగా ఒక ఒంటరి మహిళ విషయంలో కూడా ఒక దారుణం ఘటన చోటు చేసుకుంది. ఒంటరి మహిళ ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు అత్యాచారం చేసి అనంతరం ఆమెను కాల్చి చంపేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

 

ఈ దారుణమైన ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. కర్ణాటక రాష్ట్రంలోని మద్దూరు తాలూకా మారసింగనహళ్లికి చెందిన కుమార ఆరాధ్య ప్రేమ దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అతడు బెంగళూర్ లో ఉద్యోగం చేస్తున్నాడు. అతడి భార్య మండ్య లేడీస్ కాలేజీలో చదువుకుంటోంది. ఇక మూడు సంవత్సరాల క్రితం పక్షవాతంతో భర్త ఆరాధ్య మరణించడంతో అప్పటి నుంచి ప్రేమ ఒంటరిగానే మారసింగనహళ్లిలో చీటీలు నడిపిస్తూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా సోమవారం రాత్రి ఆమె ఒంటరిగా నిద్రిస్తుండగా ఇంట్లోకి చోరబడిన దుండగులు ఆమెపై అత్యాచారం చేశారు. అనంతరం దిండుతో ఊపిరి ఆడకుండా ఆమెను చంపేశారు.

 

అంతటితో ఆగకుండా దుర్మార్గులు మరింత రెచ్చిపోతూ ప్రేమను మంచంతో సహా ఆమె బెడ్ రూంలోనే కాల్చి పరారయ్యారు. అయితే మంగళవారం ఉదయం ప్రేమ ఇంట్లో నుంచి పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు వచ్చి చూడగా మంటల్లో కాలిపోయిన ప్రేమ కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రేమ మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించారు. ప్రేమ పై అత్యాచారం జరిపిన తర్వాతే హత్య చేసి పరారైనట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని నిందితులను వెతికే పనిలో పడ్డారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -