Ravi Teja: నిర్మాతలను నిండా ముంచేస్తున్న మాస్ మహారాజ్.. ఏం జరిగిందంటే?

Ravi Teja: ప్రస్తుత కాలంలో హీరోల రెమ్యూనరేషన్లు ఆకాశాన్ని తాకుతున్నాయని చెప్పాలి.ఒకప్పుడు సినిమా హిట్ అయితే మాత్రమే తదుపరి సినిమాకు రెమ్యూనరేషన్లు అధికంగా తీసుకునేవారు కానీ ప్రస్తుత కాలంలో సినిమా హిట్ అయిన ఫ్లాప్ అయిన హీరోలకు ఏమాత్రం సంబంధం లేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.ఇలా సినిమా హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా తదుపరి సినిమాలకు మాత్రం భారీగా రెమ్యూనరేషన్ పెంచుకుంటూ పోతున్నారు.

ఇలా సినిమా సినిమాకు రెమ్యూనరేషన్లు అధికంగా పెంచుతున్నటువంటి వారిలో మాస్ మహారాజ రవితేజ కూడా ఒకరు చెప్పాలి. రవితేజ తాజాగా నటించిన రావణాసుర సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. ఈ సినిమా డిజాస్టర్ అయినప్పటికీ రవితేజ తన తదుపరి సినిమా కోసం ఏకంగా 25 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం రవితేజ సందీప్ రాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.

కలర్ ఫోటో సినిమాకు దర్శకత్వం వహించిన ఈయన రవితేజతో సినిమా చేస్తున్నారు ఈ సినిమా కోసం ఈయన ఏకంగా 25 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. ఈ సినిమా కోసం ఈయన ఒకేసారి ఇంత మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇకపోతే ధమాకాతో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి మనకు తెలిసిందే.

ధమాకా సినిమా కూడా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలోని ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ద్వారా ఎంతో మంచి లాభాలను అందుకున్నటువంటి నిర్మాతలు తదుపరి తమ బ్యానర్ లో రాబోతున్న సినిమా కోసం ఏకంగా 25 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో అంత మొత్తంలో ఇవ్వడానికి మేకర్స్ కూడా సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో మరొక టాలీవుడ్ హీరో కూడా నటించబోతున్నారని సమాచారం అయితే ఇందులో శర్వానంద్ నటించబోతున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ ఎలాంటి అధికారిక ప్రకటన లేదని చెప్పాలి..

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -