Ravi Teja: మాస్ మహారాజ్ రవితేజకి.. ఇంత పెద్ద కూతురా..?

Ravi Teja: మాస్ మహారాజ్ రవితేజ.. ఈ పేరు తెలుగు సినీ ఇండస్ట్రీలో తెలియని వారు ఉండరు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తన టాలెంట్ తో స్టార్ హీరోగా ఎదిగిన తీరు ఎందరికో మార్గదర్శకంగా నిలిచాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన రవితేజ.. సైడ్ పాత్రలు చేస్తూ వచ్చాడు. ఇండస్ట్రీలో ఎలా అయినా నిలదొక్కుకోవాలనే కసితో దొరికిన ప్రతి అవకాశాన్ని అందిపుంచుకుంటూ ముందుకు సాగాడు.

 

ఈ క్రమంలోనే 1997లో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన సింధూరం మూవీలో హీరోగా మొదటిసారి చేసాడు. అనంతరం శ్రీను వైట్ల డైరెక్షన్లో నీకోసం సినిమా చేసాడు. ఈ రెండు మూవీస్ రవితేజ నటనకు మంచి మార్కులు తెచ్చి పెట్టాయి. ఇక రవితేజను పూరి జగన్నాథ్ స్టార్ హీరోగా నిలబెట్టాడు. వీరి కలయికలో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నన తమిళ్ అమ్మాయి, నేనింతే మూవీలు వచ్చి సూపర్ హిట్ అయ్యాయి.

 

డాన్ శీను మూవీతో మాస్ మహారాజ్ గా అవతరించాడు. తర్వాత కిక్, బలుపు, క్రాక్ సినిమాలతో మాస్ ఫాలోయింగ్ విపరీతంగా పెంచుకున్నాడు. మద్యలో వరుస పరాజయాలు కాస్త ఇబ్బంది పెట్టాయి. అయినా పట్టువదలని విక్రమార్కుడులా ధమాకా మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. అంతే కాకుండా ఈ మూవీతో వంద కోట్ల క్లబ్ లో చేరాడు. త్వరలోనే సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాతో దుమ్ము రేపబోతున్నాడు.

 

ఇంత మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాందించుకున్న రవితేజ పిల్లలు గురించి మాత్రం పెద్దగా తెలీదు. ఆయన కొడుకు మహాధన్ రాజా ది గ్రేట్ సినిమాల్లో నటించి మంచి మార్కులు కోటేసాడు. ఇక ఆయన కూతురు గురించి మాత్రం బయట ఎవరికి పెద్దగా తెలీదు. ఆమె పేరు మోక్షధ. సోషల్ మీడియా లో కూడా యాక్టీవ్ గా ఉండదు. చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తుంటది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -