Ravi Teja: మాస్ మహారాజ్ పారితోషికం అంత పెరిగిందా.. అసలేం జరిగిందంటే?

Ravi Teja: టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా ఏడాదికి మూడు నాలుగు సినిమాలు ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.ఈ ఏడాది చివరిలో ధమాకా సినిమాతో బ్లాక్ బాస్టర్ అందుకున్నటువంటి రవితేజ అనంతరం చిరంజీవితో కలిసి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ద్వారా సూపర్ సక్సెస్ అందుకున్నారు. అనంతరం ఈయన నటించిన రావణాసుర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది.

 

ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో రవితేజ తన తదుపరి ప్రాజెక్టుపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే ఈయన టైగర్ నాగేశ్వరరావు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా తర్వాత మరో నాలుగైదు ప్రాజెక్టులకు ఈయనగ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది అయితే ఉన్నఫలంగా ఈయన రెమ్యూనరేషన్ కూడా భారీగా పెంచేశారు ఒక్కో సినిమాకు 25 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని తెలిసిన రవితేజ ఇప్పుడు ఏకంగా 100 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ డీల్ కుదుర్చుకున్నారని తెలుస్తోంది.

ఇలా ఒకేసారి రవితేజ రెమ్యూనరేషన్ 100 కోట్లకు పెరగడానికి గల కారణం ఏంటి .. అసలు ఏం జరిగింది అనే విషయాన్ని వస్తే.. రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమా తర్వాత ఈగల్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది ఈ సినిమా కాకుండా ఈయనతో మరో మూడు సినిమాలు కూడా పీపుల్స్ మీడియా వారు నిర్మించడం విశేషం ఇలా నాలుగు సినిమాలకు కలిపి ఈ నిర్మాణ సంస్థతో రవితేజ 100 కోట్ల డీల్ కుదుర్చుకున్నారని తెలుస్తుంది.

 

ప్రస్తుతం ఒక్కో సినిమాకు 25 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకుంటున్నటువంటి రవితేజ ఒకేసారి నాలుగు సినిమాలకు కలిపి 100 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తుంది. అయితే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో మాత్రమే కాకుండా ఈయన మైత్రి మూవీ మేకర్ నిర్మాణంలో కూడా మరో సినిమా చేస్తున్నారని సమాచారం. ఏది ఏమైనా వరుస సినిమాలతో ఈ మాస్ మహారాజా మామూలు స్పీడుగా లేరని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -