Land Scam: పులివెందులలో భారీ కుంభకోణం బట్టబయలు.. ఏకంగా కలెక్టర్ సంతకం ఫోర్జరీ చేశారా?

Land Scam: రాజకీయాలలో ఎవరు అధికారంలో ఉంటే వారు భయము, భీతి లేకుండా రాష్ట్రాన్ని దోచేసుకుంటారన్న సంగతి అందరికీ తెలిసిందే. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నవారు తామేదో నీతిమంతులుగా ఉన్నట్లు, అధికారంలో ఉన్నవాళ్లు బకాసురులు అన్నట్లుగా ప్రవర్తిస్తూ పదేపదే వారు చేసిన తప్పులను ఎత్తి చూపిస్తూ ఉంటారు. మళ్లీ వాళ్లు అధికారంలోకి వచ్చినప్పుడు వారు చేయాల్సిన స్కాంలు,దందాలు అన్ని వాళ్ళు చేసేస్తారు. ఇప్పుడు వైసీపీ చేస్తున్న పని అదే.

ఇంతకీ ఏం జరిగిందంటే అధికారంలో ఉన్న వైసీపీ తాము తప్పు చేసినా ఎవరు ఏమి చేయరన్న ధీమాతో పులివెందులలో భారీగా భూకబ్జా చేసింది. ఇప్పుడు ఆ భూ బాగోతం కలకలం రేపుతోంది. ఇందులో ట్విస్ట్ ఏంటంటే చివరికి కలెక్టర్ సంతకం కూడా ఫోర్జరీ చేసేసారు ఈ మహానుభావులు. ఇదంతా జరిగింది పులివెందుల నియోజకవర్గంలోనే. పులివెందుల నియోజకవర్గంలో పలుచోట్ల 35 ఎకరాల చుక్కల భూములు ఎన్ఓసీలు జారీ అయ్యాయి.

అయితే వీటికి జిల్లా కలెక్టర్ సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసి నకిలీ ఎంఓసి లు సృష్టించారు. దీని ద్వారా చుక్కల భూములను పులివెందుల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఒకరి పేరు నుంచి మరొకరి పేరున రిజిస్ట్రేషన్ చేసేసారు. భూములు రిజిస్ట్రేషన్ కావడంతో చుక్కల భూముల నుంచి పట్టా భూమిగా మారిపోయింది. ఇదంతా చాలా ప్లాన్డ్ గా జరిగిపోయింది. వెంట వెంటనే ఆ భూముల్లో లేఅవుట్లు వేసేయటం, వెంటనే ఫ్లాట్లు వేసేసి అమ్మేసి కోట్లు వెనకేసుకోవటం అన్ని వెంట వెంటనే జరిగిపోయాయి.

అయితే ఈ విషయం గా నాలుగు రోజుల క్రితం కలెక్టర్ ఆఫీస్ లో గుసగుసలు మొదలయ్యాయి. అయితే కలెక్టర్ కార్యాలయం నుంచి పులివెందుల ఆర్డీవో కార్యాలయానికి సమాచారం వచ్చింది. కలెక్టర్ కార్యాలయ ఆదేశాలతో ఆర్డిఓ విచారణ చేశారు. కొంతమంది రెవెన్యూ అధికారులు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు వైసీపీ నేతలతో చేతులు కలిపి నకిలీ ఎన్ఓసీలు సృష్టించారని గుర్తించారు. ఇక ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి ఎందుకంటే తప్పు ఎప్పుడూ నేతల మీద ఉంచుకోరు కదా వైసీపీ వర్గం వారు. ఏ ఉద్యోగిని బలి చేస్తారో వేచి చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -