Jagan: జగన్ పై విమర్శలు చేసేవాళ్లు నోరుమూయాల్సిందే.. ఇదీ రేంజ్ అంటూ?

Jagan: ఆంధ్రప్రదేశ్లో 2019 సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో భాగంగా వైఎస్ఆర్సిపి పార్టీ 151 సీట్లను గెలుపొంది అత్యధిక మెజార్టీతో అధికారంలోకి వచ్చింది అయితే వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి గాలికి వదిలేసారని కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే ప్రజలకు అందిస్తున్నారు అంటూ జగన్ ప్రభుత్వం పై విమర్శలు చేశారు.ప్రజలకు సంక్షేమ పథకాలను అందించడం కోసం పెద్ద ఎత్తున అప్పులు చేస్తూ సంక్షేమ పథకాలు అందిస్తున్నారు అంటూ పలువురు విమర్శలు చేశారు.

రాష్ట్రం నుంచి ఆదాయం లేకపోయినా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి రాష్ట్రాన్ని అప్పులకు నెట్టేశారు అయితే సంక్షేమ పథకాలు మాత్రమే అందిస్తున్నారని రాష్ట్రంలో ఎక్కడ ఏ అభివృద్ధి పనులు జరగలేదు అంటూ ప్రతిపక్ష నేతలతో పాటు పలువురు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పరిపాలన పై విమర్శలు చేశారు అయితే ఈయన అభివృద్ధి పనులు కనుక చూస్తే విమర్శలు చేసిన వారు నోరు మూతపడతాయని చెప్పాలి.

 

జగన్మోహన్ రెడ్డి పులివెందులలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పనిచేశారు అయితే పులివెందులలో అభివృద్ధి చంద్రబాబు నాయుడు గాలికి వదిలేసారు కానీ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు నియోజకవర్గమైన కుప్పంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశారు. అదేవిధంగా పులివెందులలో ఏకంగా బస్ టర్మినల్ నిర్మించి అందరి నోర్లు మూయించారు.

 

ఇలా పులివెందులకు కనీసం బస్ టర్మినల్ కూడా ఏర్పాటు చేయలేని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నిలిచిపోయారు. అక్కడ వైసీపీకి అధికంగా మెజారిటీ ఉందన్న ఉద్దేశంతో ఈయన అభివృద్ధి పనులను గాలికి వదిలేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి కుప్పంలో పాటు తన సొంత నియోజకవర్గం అయినా పులివెందులలో కూడా అభివృద్ధి పనులు చేసి తానేంటో తన ప్రభుత్వ తీరు ఏంటో నిరూపించారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -