Sharmila: షర్మిల పులివెందుల నుంచి పోటీ చేస్తారా.. ఏమైందంటే?

Sharmila: కర్ణాటక, తెలంగాణ లాంటి దక్షిణాది రాష్ట్రాలపై జెండా ఎగరేసిన కాంగ్రెస్ ఏపీలోనూ పూర్వ వైభవం తెచ్చుకునేందుకు గట్టిగానే ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. అందులో భాగంగానే ఏపీ కాంగ్రెస్‌ కమిటీ ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్‌ షర్మిలను నియమించిన విషయం తెలిసిందే. దీంతో ఇక ఏపీలో షర్మిళ రంగంలోకి దిగబోతున్నారని వైసీపీ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించబోతున్నారంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా షర్మిళ పోటీచేసే స్థానంపైనా ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి.

ఇంకా చెప్పాలంటే ప్రస్తుతం షర్మిల పొలిటికల్ కెరీర్ సాగుతుంది. తాను తెలంగాణ బిడ్డను అంటూ చెప్పి తెలంగాణ రాజన్న రాజ్యం తెస్తానని చెప్పిన వైఎస్ షర్మిళ అనంతరం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా తప్పుకున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు ఏకంగా ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఆమె పోటీ చేయబోయే స్థానం ఇదే అంటూ కథనాలు తెరపైకి వస్తున్నాయి. కాగా వచ్చే ఎన్నికల్లో వైఎస్ షర్మిళ కడప జిల్లా నుంచే పోటీచేయబోతున్నారంటూ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. కడప కాకపోతే పులివెందుల నుంచి అయినా షర్మిల పోటీ చేయబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

 

ఈ రెండిట్లో ఏదో ఒక ప్రదేశం నుంచి షర్మిల పోటీ చేయడం ఖాయం అని తెలుస్తోంది. ఎంపీగా అనుకుంటే కడప లోక్ సభ స్థానం నుంచి, ఎమ్మెల్యేగా అయితే ఏకంగా పులివెందుల నుంచే పోటీ చేయబోతున్నారంటూ వార్తలు తెరపైకి వస్తున్నాయి. అయితే అది అధిష్టాణం నిర్ణయమా లేక, ఈమె సొంత నిర్ణయమా అనేది తెలియాల్సి ఉంది కానీ.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -