Pulivendula: పులివెందుల ఎమ్మెల్యే జగన్ కు చంద్రబాబు షాకివ్వడం సాధ్యమేనా?

Pulivendula: ఎన్నికలు దగ్గర పడటంతో రాజకీయ కవ్వింపులు జోరు అందుకుంటున్నాయి. ఒకప్పుడు జగన్ చంద్రబాబు నాయుడుని రెచ్చగొడితే ఇప్పుడు చంద్రబాబు తిరిగి అదే పని చేసి జగన్ కి చుక్కలు చూపిస్తున్నారు చంద్రబాబు. ఒకప్పుడు అధికార పక్షం, ప్రధాన ప్రతిపక్షాల నాయకులు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గం వారు పెద్దగా దృష్టి సాధించేవారు కాదు. అక్కడ ఆయా అభ్యర్థులకి ఉన్న పలుకుబడిని దృష్ట్యా నామమాత్రంగా అభ్యర్థులని నిలబెట్టేవారు కానీ జగన్ పొలిటికల్ ఎంట్రీ తర్వాత సీన్ మొత్తం మారిపోయింది.

జగన్ చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గాన్ని టార్గెట్ చేశారు. బాబుని ఓడించేందుకు జగన్ సర్వసక్తులు వండుతున్నారు మంత్రి పెద్దిరెడ్డికి చంద్రబాబుని ఓడించే బాధ్యతలను కూడా అప్పజెప్పారు జగన్. స్థానిక సంస్థల ఎన్నికల అప్పుడు కుప్పంలో వైసీపీ తెలుగులోని విజయాలని సొంతం చేసుకోవడం వలన ఆ కాన్ఫిడెన్స్ తోనే మరొక అడుగు ముందుకు వేసి కుప్పం నియోజకవర్గం ని టార్గెట్ చేశారు జగన్.

 

వై నాట్ 175 నినాదంతో రాజకీయ రచ్చ చేస్తున్నారు. కుప్పంలో పెద్దిరెడ్డి తరచూ పర్యటిస్తూ బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో తనని ఇబ్బంది పడుతున్న జగన్ కి చెక్ పెట్టేందుకు చంద్రబాబు సైతం వ్యూహాన్ని రచించారు. పులివెందులకి తన శ్రేణులని ఉసిగొలుపుతున్నారు. ఇందులో భాగంగానే బుధవారం సాయంత్రం పులివెందులలో బహిరంగ సభ నిర్వహించడానికి చంద్రబాబు నిర్ణయించుకున్నారు. అయితే చంద్రబాబు నాయుడు ఈనెల రెండవ తారీకున వైయస్సార్ జిల్లాలోని గండికోట, చత్రపతి ప్రాజెక్ట్ ఎత్తిపోతల పథకాలను పరిశీలిస్తారు.

 

ఆ తరువాత వెళ్లి పులివెందుల నాలుగు రోడ్ల కూడలిలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. అయితే దీనంతటికి కారణం జగన్ దూకుడు చర్యలే అంటున్నారు తెలుగుదేశం వర్గం వారు. జగన్ రెచ్చగొట్టబట్టే నాలుగు రోడ్ల కూడలిలో చంద్రబాబు మీటింగ్ ని ఏర్పాటు చేయనున్నారు. గతంలో చంద్రబాబు పులివెందులపై పెద్దగా దృష్టి పెట్టకపోవటాన్ని ఈ సందర్భంగా టీడీపీ వర్గాల వారు గుర్తు చేశారు. మొత్తానికి ఢీ అంటే ఢీ అంటున్నారు అధికార, ప్రతిపక్షం వారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -