Meena: రెండో పెళ్లిపై నోరు విప్పిన మీనా.. దిగజారి అంటూ?

Meena: సీనియర్ నటి మీనా గురించి అందరికీ తెలిసిన విషయమే. 1982లో తమిళ చిత్రం ‘నేన్‌జంగల్’తో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ రంగంలో ఎంట్రీ ఇచ్చింది. దాదాపు 45 వరకు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగానే రాణించారు. రాజేంద్రప్రసాద్ హీరోగా నటించిన ‘నవయుగం’ సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, ప్లేబ్యాక్ సింగర్‌గా, నిర్మాతగా మీనా ఓ వెలుగు వెలిగారు. వ్యక్తిగత విషయానికి వస్తే.. మీనా 2009లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ విద్యాసాగర్‌ను పెళ్లి చేసుకుంది. ఇటీవలే ఆయన భర్త స్వర్గీయులయ్యారు.

 

 

భర్తను కోల్పోయిన బాధ నుంచి బయట పడటానికి మీనా తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. బాధను మర్చిపోవడానికి పలు భాషల సినిమాల్లో నటిస్తోంది. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని కెరీర్‌పై ఫోకస్ పెట్టింది. అయితే తాజాగా మీనా రెండో పెళ్లి చేసుకోబోతుందని ప్రచారం జరుగుతోంది. ఒంటరిగా ఉండకూడదని మీనా తల్లిదండ్రులు తమ బంధువుల్లో ఓ వ్యక్తితో పెళ్లి సంబంధం మాట్లాడారని, దానికి మీనా కూడా ఓకే చెప్పిందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై మీనా స్పందించింది. సోషల్ మీడియాగా వస్తున్న వార్తలను మీనా ఖండించింది.

 

 

ఈ సందర్భంగా మీనా మాట్లాడుతూ..‘మీకు బుద్ధుందా? డబ్బు కోసం ఏదైనా చేస్తారా? భర్త పోయిన బాధలో నేనుంటే.. రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రచారం చేస్తున్నారు. నిజనిజాలు తెలుసుకోకుండా దిగజారి ప్రవర్తిస్తున్నారు. నా భర్త చనిపోయినప్పుడు కూడా ఎన్నో తప్పుడు ప్రచారాలు చేశారు. ఇంకా అలానే ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసే వారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటాను.’ అని వార్నింగ్ ఇచ్చింది. నెటిజన్లపై తీవ్రస్థాయిలో మండిపడింది. అయితే ఆమె ఎంత బాధపడి ఉంటే.. అంతలా వార్నింగ్ ఇచ్చి ఉంటుందని మీనా ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -